Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Fake Police | వరుస నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయాం దోళనలకు గురిచేస్తున్న ఓ కరడుగట్టిన నేరగాడిపై సైబరాబాద్ పోలీసులు మరోసారి ప్రివెంటివ్ డిటె న్షన్ (పీడీ) యాక్ట్‌ను ప్రయోగించారు.
Fake Police | సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): వరుస నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయాం దోళనలకు గురిచేస్తున్న ఓ కరడుగట్టిన నేరగాడిపై సైబరాబాద్ పోలీసులు మరోసారి ప్రివెంటివ్ డిటె న్షన్ (పీడీ) యాక్ట్‌ను ప్రయోగించారు. పోలీసు అధికారిగా నటిస్తూ ప్రజలను మోసం చేయడం, కిడ్నాప్ లు, దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతూ ప్రజల ఆస్తులు, ప్రాణాలకు ముప్పుగా మారాడు. దీంతో తీవ్రంగా స్పందించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేశ్ నిందితుడు నాగరాజు రఘు వర్మ అలియాస్ వంశీ అలియాస్ కల్నల్ కార్తికేయ సింగ్‌పై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నిందితుడిని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.
పోలీసు అధికారినంటూ మోసాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాగరాజు రఘు వర్మ తొలుత డ్రైవర్‌గా పనిచేశాడు. సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో నేరాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు అధికారిగా పరి చయం చేసుకుంటూ వివిధ పోలీస్ స్టేషన్లలో బాధితులపై క్రిమినల్ రఘు వర్మ కేసులు నమోదయ్యా యని నమ్మించేవాడు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించి, కేసుల నుంచి బయటపడేందుకు సహాయం చేస్తా నంటూ డబ్బులు వసూలు చేసేవాడు. అంతేకా కుండా లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను కిడ్నాప్ చేసి, తుపాకులతో బెదిరించి నగదు దోచుకునేవాడని పోలీసులు వెల్లడించారు.
14 కేసుల్లో..
2017 నుంచి 2026 వరకు నిందితుడిపై మోసం, కిడ్నాప్, దోపిడీ, డబ్బుల కోసం బెది రింపులు, ఆయుధాల చట్టం కింద మొత్తం 14 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గతంలో 2021, 2024 సంవత్సరాల్లోనూ సైబరాబాద్ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా నిందితుడు తన నేరప్రవృత్తిని మార్చుకోకుండా మరోసారి నేరాలకు పాల్పడ్డాడు. పోలీసు అధికా రిగా నటిస్తూ కిడ్నాప్‌లు, వసూళ్లు, దోపిడీలకు పాల్పడడంతో నిందితుడిపై మరో నాలుగు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
నేరాల నియంత్రణకే పీడీ యాక్ట్..
తాజాగా నమోదైన కేసులకు సంబంధించి జగద్గిరిగుట్ట పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్ కింద జైలుకు పంపినప్పటికీ, విడుదలైన తర్వాత మళ్లీ నేరాలకు పాల్పడుతుండటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అతడి నేర కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి, భవిష్యత్తులో మరిన్ని నేరాలకు పాల్పడకుండా నిరోధించేందుకు మరోసారి పీడీ యాక్ట్ అమలు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ డా.ఎం.రమేశ్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
‘ఏసీబీ ఉచ్చులో ఎస్సై’.. సంచలనం సృష్టించిన ‘నమస్తే తెలంగాణ’ కథనం.. రంగంలోకి నిఘా వర్గాలు!
Upasana | మహిళల విజయంపై ఉపాసన కీలక సందేశం..ఇతర మహిళలను తొక్కేసి విజయం సాధించొద్దు..!
Virosh | విజయ్ దేవరకొండ – రష్మిక విడాకులు తీసుకుంటున్నారా.. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

