సిటీబ్యూరో, మార్చి 25(నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఎక్కడైనా ఊర్ల పేరు మీద.. విస్తీర్ణం ఆధారంగా చెరువులకు పేర్లు ఉంటాయి. కానీ బతుకమ్మ కుంట.. రాష్ట్రంలో ఎక్కడా ఓ పండుగ పేరు మీద నీటి వనరు పేరు కనిపించదు. మరి.. అంబర్‌పేట పరిధిలో బతుకమ్మ కుంట ఎందుకు వెలిసింది? అసలు అది సహజసిద్ధంగా ఏర్పడిన నీటి వనరునా? లేదా కృత్రిమంగా తయారు చేసిన కుంటనా?.. అసలు బతుకమ్మ కుంట వెనక అసలు కథేమిటి? ..వాస్తవానికి అది సహజ నీటి వనరు కాదు… అసలు కుంటనే కాదంటున్నారు.. ఆ భూమి యజమానిగా హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డి.
రాజకీయం లిఖించిన ఓ కృత్రిమ నీటి వనరునే బతుకమ్మ కుంట అని కుండబద్దలు కొట్టారు. ప్రధానంగా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు తన అక్రమాల్ని కప్పిపుచ్చుకోవడంతో పాటు రాజకీయంగా తమపై ఉన్న కక్షతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుంటను సృష్టించారని చెబుతున్నారు. బతుకమ్మ కుంట వెనక ఉన్న రాజకీయం ఏమిటీ? ఆ రాజకీయాన్ని సంతృప్తిపరిచే బాధ్యతను హైడ్రా కమిషనర్ రంగనాథ్ భుజాన ఎందుకు వేసుకున్నారనే వివరాల్ని ఆయన సమగ్రంగా వెల్లడించారు.
వాస్తవానికి అది సహజ నీటి వనరు కాదు… అసలు కుంటనే కాదంటున్నారు… ఆ భూమి యజమాని హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డి. రాజకీయం లిఖించిన ఓ కృత్రిమ నీటి వనరునే బతుకమ్మ కుంట అని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రధానంగా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు(వీహెచ్) తన అక్రమాల్ని కప్పిపుచ్చుకోవడంతో పాటు రాజకీయంగా మాపై ఉన్న కక్షతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుంటను సృష్టించారని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు.
వీహెచ్ ఒత్తిడి… ఆయనను సంతృప్తిపరచడంతో పాటు ఓ కుంటను రూపొందించి ప్రజలకు అందించామనే ప్రచారం చేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల్ని ఆసరాగా చేసుకొని హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఏకపక్షంగా… దుందుడుకుగా… చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ… తనను గృహ నిర్బంధం చేసి ఐదెకరాల భూమిని ఒక కుంటగా చిత్రీకరించారని సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ కుంటవెనక ఉన్న రాజకీయం ఏమిటి? ఆ రాజకీయాన్ని సంతృప్తిపరిచే బాధ్యతను హైడ్రా కమిషనర్ రంగనాధ్ భుజాన ఎందుకు వేసుకున్నారనే వివరాల్ని ఆయన సమగ్రంగా వెల్లడించారు.
బాగ్‌అంబర్‌పేట గ్రామంలో బతుకమ్మకుంటగా చెప్పే సర్వేనెంబర్లో ఉన్న భూమి ఖుష్కీల్యాండ్గా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో 1987వరకు వ్యవసాయం చేసేవారని, ఇటుకబట్టీలు పెట్టేవారని స్థానికులు చెప్పారు. ఇదిలా ఉంటే వర్షపు నీరు శివం రోడ్డులో పలు మార్గాల ద్వారా మూసీకి చేరేవని అసలు బతుకమ్మకుంట ఉన్న ప్రాంతానికి ఏ నీటి ప్రవాహం కనెక్ట్ కాదని తెలుస్తోంది. బాగ్అంబర్పేటలోని బతుకమ్మ కుంట చెరువే కాదంటున్నారు సుధాకర్‌రెడ్డి.
ఒకవేళ బతుకమ్మ కుంట వాటర్‌బాడీ అయితే మే 25, 1978లో ఏపీ గెజిట్ నోటిఫికేషన్లో బాగ్‌అంబర్‌పేట గ్రామంలోని సర్వే నంబర్లు 563/1,2 సయ్యద్ ఆజమ్ తదితరులకు చెందిన భూమిని డ్రైల్యాండ్ అని ఇచ్చారు. గతంలో అక్కడ ఖాళీ స్థలంగా పలు శాఖల రికార్డులు చూపించాయి. గ్రామ చిత్రంలో బతుకమ్మకుంట అని ఎక్కడా లేదు. కాగా విలేజ్ మ్యాప్‌లో కేవలం నాగమయ్య కుంట ఉండటం, బతుకమ్మకుంటగా చెబుతున్న సర్వేనంబర్లు ఖాళీజాగాగ చూపించారు.
2014లో ప్రభుత్వానికి కలెక్టర్ ఇచ్చిన నివేదిక ప్రకారం 19 ఎకరాలను బాగ్‌అంబర్‌పేట సొసైటీ, తులసీనగర్ సొసైటీలకు హడ్కో స్కీమ్ కింద ఇళ్లు కట్టుకోవాలంటూ అప్పగించింది. హడ్కో కింద ఇచ్చిన భూమిలో 40శాతం ప్రజాప్రయోజనాలకోసం కేటాయించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. అక్కడ వారు ఇళ్లు కట్టుకున్నక్రమంలో ఈ ఏడెకరాల భూమి రోడ్డు కంటే లోపలికి కావడంతో దానిని పైకి లేపారు. ఆ సమయంలో అక్కడ వర్షపు నీరు పడి నిలవడంతో అక్కడ స్థానికులు బతుకమ్మలు ఆడేవారనిచెప్పారు. బతుకమ్మలు ఆడినందుకు బతుకమ్మకుంటగా చెబుతున్నారు తప్ప అసలు ఎక్కడైనా పండుగ పేరుతో చెరువు ఉండటం చూశామా అంటూ ఆయన ప్రశ్నించారు.