చెత్త రీసైక్లింగ్‌కు మొబైల్ వాహనం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు పెద్దపీట వేశారు. ఈ క్రమంలో సస్టెయినబిలిటీ ఆన్ వీల్స్ పేరుతో స్విచ్ఎకో సంస్థ చెత్తను రీసైక్లింగ్ చేసే అధునాతన వాహనాన్ని రూపొందించింది. ఈ వాహనాన్ని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులు ప్రదర్శించి పనితీరును వివరించారు.
- పీసీబీలో ప్రదర్శించిన స్విచ్ఎకో సంస్థ
సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు పెద్దపీట వేశారు. ఈ క్రమంలో సస్టెయినబిలిటీ ఆన్ వీల్స్ పేరుతో స్విచ్ఎకో సంస్థ చెత్తను రీసైక్లింగ్ చేసే అధునాతన వాహనాన్ని రూపొందించింది. ఈ వాహనాన్ని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులు ప్రదర్శించి పనితీరును వివరించారు. చెత్తను సేకరించి అక్కడికక్కడే రీసైక్లింగ్ చేసి వినియోగించేందుకు అనువుగా మార్చేవిధంగా ఈ వాహనాన్ని రూపొందించారు. ఈ వాహనంలో గృహ వ్యర్థాలు, ప్లాస్టిక్, శానిటరీ వ్యర్థాలు, థర్మకోల్, టెక్స్‌టైల్స్‌తో పాటు ఆహార వ్యర్థాలను కూడా రీసైక్లింగ్ చేసేలా ఆయా పరికరాలను అమర్చారు.
దీని గురించి స్విచ్ఎకో సంస్థ స్థాపకుడు అక్షయ్ దేశ్‌పాండే వివరించారు. వివిధ రకాల చెత్తలను ఎక్కడికక్కడ రీసైక్లింగ్ చేసి వినియోగంలోకి తీసుకురాగలిగే అన్ని పరికరాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. ఇది చెత్తను అక్కడికక్కడే రీసైక్లింగ్ చేసే ప్రపంచంలోనే మొట్టమొదటి వాహనమని వెల్లడించారు. ఒకేసారి ఇది 250 కేజీల బరువును మోయగలుగుతుందని చెప్పారు. డ్రైవర్, క్లీనర్, వాహనంలో వినియోగించే డీజిల్‌తో కలిపి నెలకు రూ.51 వేలు మాత్రమే దీనికి ఖర్చు అవుతుందన్నారు. ఒక వాహనాన్ని 10కి పైగా గ్రామాల్లో చెత్త నిర్వహణకు ఉపయోగించవచ్చన్ని తెలిపారు. తొలుత ఒక గ్రామంలో ఉంచి పనితీరును పరీక్షించనున్నట్లు వెల్లడించారు. ఈకార్యక్రమంలో పీసీబీ సీఈ రఘు, సీనియర్ సోషల్ సైంటిస్టు ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

