BRS | బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
గాంధీ దవాఖాన పోలీసు క్యాంపు ఆఫీస్‌గా మారింది. ఏమి జరుగుతుందో తెలియక కొంత మంది రోగులు దవాఖాన బయటి నుంచే వెనుదిరిగారు. గత నెలలో జరిగిన మాతా శిశు మరణాల నేపథ్యంలో దవాఖానలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
BRS | బన్సీలాల్‌పేట, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖాన పోలీసు క్యాంపు ఆఫీస్‌గా మారింది. ఏమి జరుగుతుందో తెలియక కొంత మంది రోగులు దవాఖాన బయటి నుంచే వెనుదిరిగారు. గత నెలలో జరిగిన మాతా శిశు మరణాల నేపథ్యంలో దవాఖానలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. జరిగిన ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు సోమవారం గాంధీ దవాఖానకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
కమిటీ సభ్యులు, వారికి మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు దవాఖానకు వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఉదయం నుంచే దవాఖాన వద్ద భారీగా మోహరించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గాంధీ దవాఖానకు చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగడంతో అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ… మాతా, శిశు మరణాల గురించి తెలుసుకునేందుకు వస్తే అడ్డుకుని, అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు. చిన్నారులు పిట్టల్లా రాలిపోతుంటే వివరాలు తెలుసుకోవడం తప్పా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు ముఠా జైసింహా, విజయ్‌శంకర్, కే.దేవేందర్, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి చిలకలగూడ పీఎస్‌కు తరలించారు. సాయంత్రం వారిని సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. కార్పొరేటర్ సునీత, నాయకులు ఎస్.రాజేందర్, శ్రీనివాస్, ఓ.రాజు, అనిత వారికి మద్దతుగా పీఎస్‌కు వచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

