Hyderabad | చిన్నారిని చంపేశాడు.. విల్లా ఆర్చిడ్స్ అపార్ట్మెంట్లో చిన్నారి కిడ్నాప్ కేసు విషాదాంతం!
బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి కిరాతకంగా హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు సెక్యూరిటీ గార్డు విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి కిరాతకంగా హతమార్చిన కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు సెక్యూరిటీ గార్డు విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సాంకేతికతను ఆధారంగా చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు సెక్యూరిటీ గార్డులను సైతం విచారిస్తున్నారు. కౌకూర్‌లోని విల్లా ఆర్చిడ్స్ అపార్ట్మెంట్లో మిల్టన్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడి కుమార్తె మోసెస్ ఆరులియా శనివారం రాత్రి అపార్ట్మెంట్ సెల్లార్లో ఆడుకుంటూ కొంత సేపటికే.. కనిపించకుండా పోయింది.
చిన్నారి జాడ కోసం అపార్ట్‌మెంట్‌తో పాటు పరిసరాల్లో వెతికిన కుటుంబ సభ్యులకు రాత్రి సుమారు 11 గంటల సమయంలో దుండగుడి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. చిన్నారి తాతతో ఫోన్‌కాల్ మాట్లాడిన దుండగుడు పాపను విడిచిపెట్టాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పాపను చంపేసిన తర్వాతే కిడ్నాపర్ ఫోన్ కాల్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. బీహార్‌కు చెందిన విక్రమ్ గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఉద్యోగం నుంచి తొలగించిన కొద్ది రోజులకే చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు పథకం వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

