Kanchan Bagh | బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్.. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు
Kanchan Bagh | ఈడీ కార్యాలయం వద్ద అరెస్టు చేసిన పలువురు బీఆర్ఎస్ నేతలను(BRS leaders) కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు(Kanchan Bagh Police Station) తరలించారు.
హైదరాబాద్ : ఈడీ కార్యాలయం వద్ద అరెస్టు చేసిన పలువురు బీఆర్ఎస్ నేతలను(BRS leaders) కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు(Kanchan Bagh Police Station) తరలించారు. వారిలో పల్లెరవికుమార్ గౌడ్, క్రిశాంక్, సుమిత్రానంద్, పావని గౌడ్, కీర్తిలత గౌడ్, తదితరులు ఉన్నారు. కాగా, బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల జులుంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, పల్లె రవికుమార్ మండిపడ్డారు. ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మాపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే అక్రమ అరెస్టులు ఏంటని ప్రశ్నించారు.
పోలీసులు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. అలాగే బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను( Manne Krishank) పోలీసులు అరెస్టు చేశారు. ఈడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. కాగా, బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌కు భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

