గానా బజానాతో కస్టమర్లకు ఎర
గానాబజానాతో కస్టమర్లను ఆకర్షిస్తూ.. అనధికారిక పబ్ నిర్వహిస్తున్న ‘క్లబ్ టఖిలా’ కేఫ్ అండ్ బార్‌పై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఎండీతో పాటు 18 మందిని అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. రాంగోపాల్‌పేట్‌లోని క్లబ్ టఖిలా కేఫ్ అండ్ బార్ పేరుతో గ్యారల విజయ్‌కుమార్‌గౌడ్
- అనధికారికంగా పబ్ నిర్వహణ
- ఎండీతో పాటు 18 మంది అరెస్ట్
- పట్టుపడిన వారిలో 8 మంది యువతులు
- పరారీలో ప్రధాన సూత్రధారి
సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): గానాబజానాతో కస్టమర్లను ఆకర్షిస్తూ.. అనధికారిక పబ్ నిర్వహిస్తున్న ‘క్లబ్ టఖిలా’ కేఫ్ అండ్ బార్‌పై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఎండీతో పాటు 18 మందిని అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. రాంగోపాల్‌పేట్‌లోని క్లబ్ టఖిలా కేఫ్ అండ్ బార్ పేరుతో గ్యారల విజయ్‌కుమార్‌గౌడ్ బార్ నిర్వహిస్తుండగా, నళినీరెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
బార్ అండ్ రెస్టారెంట్‌కు అనుమతి పొంది, కస్టమర్లు ఎక్కువగా రాకపోవడంతో అనధికారికంగా పబ్‌ను నడిపిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి.. గానాబజానాతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. అమ్మాయిలు ఉండటంతో అక్కడకు రోజు రోజు వెళ్లే వారి సంఖ్య పెరగడం, అర్ధరాత్రులు దాటినా.. పబ్ కొనసాగుతుండటంతో శనివారం రాత్రి సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ ఆధ్వర్యంలో బృందం దాడి చేసింది. ఎండీ నళినీరెడ్డితో పాటు అకౌంటెంట్ ఎన్.రవి, డీజే ఆపరేటర్లు హరికృష్ణ, సయ్యిద జరీన్, క్యాషియర్ బి. ప్రకాశ్‌తో పాటు 8 మంది యువతులు, ఐదుగురు కస్టమర్లను అరెస్ట్ చేశారు. విజయ్‌కుమార్ గౌడ్ పరారీలో ఉన్నాడు. ఈ కేసు తదుపరి విచారణను రాంగోపాల్‌పేట్ పోలీసులకు అప్పగించారు.
రష్యన్ యువతులతో అశ్లీల నృత్యాలు
బంజారాహిల్స్, మే 29 : రష్యన్ యువతులతో అశ్లీల నృత్యాలు చేయించిన ఓ పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్ నం. 36లో ఇనిగ్మా పేరుతో కొత్త పబ్‌ను ప్రారంభించి.. రష్యాకు చెందిన యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. నిర్వాహకులు చౌల్సింగ్, దుర్గాప్రసాద్‌లపై కేసు నమోదు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- cafe
- club tequila
- Police
- raid
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

