వరద నీరు పోయేదెట్లా..?
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న ఓపెన్ నాలాలో వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకపోయి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు వీలు లేకుండా దర్శనమిస్తుంది. వర్షాకాలంలో వరద నీరు రోడ్లపై పారకుండా ఉండేలా రోడ్డుకిరువైపులా ఓపెన్ నాలాలను సంబంధిత అధికారులు నిర్మించారు. సంబంధిత కాం ట్రాక్టర్ పర్యవేక్షణ లోపం కారణంగా
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో
ఓపెన్ నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు
జీడిమెట్ల, మే25: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న ఓపెన్ నాలాలో వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకపోయి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు వీలు లేకుండా దర్శనమిస్తుంది. వర్షాకాలంలో వరద నీరు రోడ్లపై పారకుండా ఉండేలా రోడ్డుకిరువైపులా ఓపెన్ నాలాలను సంబంధిత అధికారులు నిర్మించారు. సంబంధిత కాం ట్రాక్టర్ పర్యవేక్షణ లోపం కారణంగా పారిశ్రామిక వాడ లో ఉన్న ఓపెన్ నాలాలో వ్యర్థాలు,చెత్తాచెదారం పేరుకుపోయింది. ముఖ్యంగా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఫేజ్ 5లో ఉన్న కాంతా ఫాలిమర్స్ కంపెనీ ఎదురుగా ఉన్న ఓపెన్ నాలాలో వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు రోడ్డుపైనే పారిశుధ్యం లోపంతో కంపుకొడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జీడిమెట్ల ఐలా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే వర్షాకాలంలో నాలాలో వ్యర్థాలు పేరుకుపోవడంతో వరద నీరు ఎలా వెళ్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఐలా అధికారులు స్పందించి సంబంధిత శానిటేషన్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని నాలాలో పేరుకపోయిన వ్యర్థాలను తొలగించేలా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం
-ఎ.విజయ, జీడిమెట్ల ఐలా కమిషనర్
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న ఓపెన్ నాలాలో పేరుకపోయిన వ్యర్థాల విషయమై జీడిమెట్ల ఐలా కమిషనర్ ఎ.విజయను వివరణ కోరగా సంబంధిత శానిటేషన్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని నాలాలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేలా చూస్తామని తెలిపారు. వర్షాకాలంలో వరద నీరు సాఫీగా వెళ్లేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

