పోలింగ్.. ఇయ్యాల్నే
ఓట్ల పండగకు గ్రేటర్ సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరిగే పోలింగ్ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు జిల్లాల్లోని నాలుగు ఎంపీ స్థానాలతో పాటు, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతున్నది.
- ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు..
- మూడు జిల్లాల్లో 140 మంది అభ్యర్థులు
- ఓటర్లు.. కోటీ పది లక్షలు.. 9,859 పోలింగ్ కేంద్రాలు..
సిటీబ్యూరో, మే 12, (నమస్తే తెలంగాణ) : ఓట్ల పండగకు గ్రేటర్ సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరిగే పోలింగ్ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు జిల్లాల్లోని నాలుగు ఎంపీ స్థానాలతో పాటు, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతున్నది. మొత్తం 140 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 9,859 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, కోటీ పది లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ర్యాంప్‌లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ కోట్ల విజయ భాసర్‌రెడ్డి స్టేడియంలో జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్, సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెగ్మెంట్లో ఏర్పాటు చేసిన డీఆర్సీలను ఆకస్మికంగా తనిఖీ చేసి.. పలు సూచనలు చేశారు.
ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా..
పోలింగ్ వేళ ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా..ప్రత్యామ్నాయంగా మరో 12 గుర్తింపు కార్డుల్లో ఏది చూపించైనా.. ఓటు వేసే అవకాశాన్ని సీఈసీ కల్పించింది. ఆధార్ కార్డు, పోస్టాఫీస్, బ్యాంక్ జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, ఆర్జీఐ ద్వారా జారీ చేసిన స్మార్ట్‌కార్డు, ఇండియన్ పాస్‌పోర్టు, ఫొటోతో కూడిన పింఛన్ మంజూరు డాక్యుమెంట్, ఫొటోతో కూడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపుపత్రం, దివ్యాంగుల గుర్తింపు కార్డు ఏదైనా.. ఒక గుర్తింపు కార్డును వెంట తీసుకొని, ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
బాధ్యతగా ఓటు వేయండి సీఈవో వికాస్ రాజ్
ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్తో కలిసి ఆయన చార్మినార్, యాకత్‌పుర అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏర్పాట్లను పరిశీలించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు జిల్లా ఎన్నికల అధికారి అన్ని ఏర్పాట్లు చేసినట్లు సీఈవో వివరించారు.
ఏర్పాట్లు పూర్తి జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్
పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. జిల్లాలో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్‌తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతున్నదని, 3986 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 45 లక్షల ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకోనున్నారని జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

