మేడ్చల్, ఏప్రిల్18)నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. మల్కాజిగిరి స్థానానికి సంబంధించి 8 నామినేషన్లు దాఖలు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు.