Praja Bhavan | ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిన కారు..
ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ముందున్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ముందున్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 23న (శనివారం) అర్ధరాత్రి దాటిన తర్వాత టీఎస్13ఈటీ 0777 అనే కారు వేగంగా దూసుకొచ్చి ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టింది. దీంతో అవి పూర్తిగా ధ్వంసమవగా, కారు ముందుభాగం దెబ్బతిన్నది. ప్రమాదం తర్వాత కారు ఆగిన వెంటనే అందులోనుంచి ఓ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మరో యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. కాగా, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా కారులో ముగ్గురు యువతులు ప్రయాణించినట్లు గుర్తించారు.
కాగా, కారును నిర్లక్ష్యంగా నడిపిన అబ్దుల్ ఆసిఫ్‌పై పంజాగుట్టా పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు కారును నడిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahasakthi | నయనతార ‘మహాశక్తి’కి తెలుగులో గట్టి పరీక్ష.. రేపే థియేటర్లలోకి, పోటీగా ‘రామాయణ’, ‘సీన్’!
Walking | కండరాలు దృఢంగా మారాలంటే వాకింగ్ సరిపోతుందా.. దీంతో ఏం జరుగుతుంది..?
Paris Jackson: 600 మిలియన్ల డాలర్లు ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన మైఖేల్ జాక్సన్ కుమార్తె
T-Hub | కలలకు రెక్కలు తొడిగి 11 వసంతాలు: అంతర్జాతీయ ఆవిష్కరణల వేదికగా ఎదిగిన ‘టీ-హబ్’
AP News | ఏపీలో కొనసాగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

