‘ఉస్మానియా తక్ష్ – 2024’ ప్రారంభం
ఉస్మానియా యూనివర్సిటీ 107వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా‘ఉస్మానియా తక్ష్ - 2024’ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. వేడుకలను ముందస్తుగా ఓయూ ఇంజినీరింగ్ కళాశాల నుంచి సెంటెనరీ పైలాన్ వరకు 2కే వాక్ నిర్వహించారు.
ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 24 : ఉస్మానియా యూనివర్సిటీ 107వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా‘ఉస్మానియా తక్ష్ – 2024’ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. వేడుకలను ముందస్తుగా ఓయూ ఇంజినీరింగ్ కళాశాల నుంచి సెంటెనరీ పైలాన్ వరకు 2కే వాక్ నిర్వహించారు. ఈ వాక్కు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీ ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.
25న వర్సిటీలోని అన్ని విభాగాలలో ఓపెన్ హౌజ్ కార్యక్రమాలతో పాటు వివిధ రకాల పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. 26న ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10:30గంటలకు జరుగనున్న వేడుకలకు ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ విజయ్‌కుమార్ సారస్వత్, గౌరవ అతిథులుగా రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, అమెరికాలోని ఇమేజియా కార్పొరేషన్ ఫౌండర్, సీఈవో వీణ గుండవెళ్లి హాజరుకానున్నారని వివరించారు.
మధ్యాహ్నం 3గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, దీనికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత, కవి జయరాజు హాజరవుతారని చెప్పారు. ఈ వేడుకలకు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. పైలాన్ వద్ద విద్యార్థుల నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, డెవలప్మెంట్ అండ్ యూజీసీ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ జి.మల్లేశం, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, డైరెక్టర్లు, డీన్లు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, అనుబంధ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

