సారథిపై వెనక్కేనా?
సారథి నుంచి రవాణా శాఖ తప్పుకోనుందా? మళ్లీ పాత సాఫ్ట్వేర్ పోర్టల్ సీఎఫ్ఎస్టీనే వినియోగంలోకి తీసుకురానున్నారా? స్లాట్ బుక్ చేయడానికి కూడా వీల్లేని విధంగా సారథి పోర్టల్.. ఓటీపీలు సకాలంలో రాక ఇబ్బందులు పెడుతున్న పోర్టల్‌తో ఆర్టీఏ అధికారులు సైతం విసిగిపోతున్నారు.
- విసిగిస్తున్న పోర్టల్
- స్లాట్ బుక్స్ కాని వైనం
- రవాణా శాఖ అధికారుల ఇబ్బందులు
- ఫీడ్ బ్యాక్ తీసుకున్న ఉన్నతాధికారులు
- సారథితో కష్టమేనని తేల్చేసిన అధికారులు
- గతంలో సీఎఫ్ఎస్టీ సాఫ్ట్వేర్ బెటర్ అంటూ అభిప్రాయాలు
సిటీబ్యూరో, అక్టోబర్ 3 ( నమస్తే తెలంగాణ ): సారథి నుంచి రవాణా శాఖ తప్పుకోనుందా? మళ్లీ పాత సాఫ్ట్వేర్ పోర్టల్ సీఎఫ్ఎస్టీనే వినియోగంలోకి తీసుకురానున్నారా? స్లాట్ బుక్ చేయడానికి కూడా వీల్లేని విధంగా సారథి పోర్టల్.. ఓటీపీలు సకాలంలో రాక ఇబ్బందులు పెడుతున్న పోర్టల్‌తో ఆర్టీఏ అధికారులు సైతం విసిగిపోతున్నారు. ఈ క్రమంలో రెండు నెలల నుంచి సారథి సేవలపై రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆర్టీఓ కార్యాలయాల వారీగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
నగరంలోని అన్నీ ఆర్టీఓ కార్యాలయాల నుంచి సారథీ పోర్టల్‌తో అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయంటూ ఆర్టీఓలు అభిప్రాయాలను పంపించారు. సారథి సమస్యలను పరిష్కరించే ఐటీ బృందాలు సైతం ఎర్రర్ ఇష్యూలను పరిష్కరించలేకపోతున్నది. వాహనదారులు లైసెన్స్‌ల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సారథి పోర్టల్ సేవల నుంచి తప్పుకునే మార్గాలను సైతం రవాణా శాఖ ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్టు తెలిసింది.
పైలెట్ ప్రాజెక్టే విఫలం..
ఎక్కడైనా ఏదైన కొత్త పాలసీ అమలు చేయాలంటే ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి వాటిలోని సాధ్యసాధ్యాలను పరిశీలిస్తారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వాటికి పరిష్కార మార్గాలను గుర్తిస్తారు. పూర్తిస్థాయిలో ఆ పాలసీ అమలు చేయడానికి అవసరమైన అన్నీ మార్గాలను సులభతరం చేస్తారు. కానీ రవాణా శాఖ అధికారులు సారథి పోర్టల్ సేవలను వినియోగంలోకి తీసుకురావడానికి సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేశారు.
కానీ ఇబ్బందులను మాత్రం … వదిలేశారు. స్లాట్ సమస్య పైలెట్ ప్రాజెక్టులోనే ఎదురయ్యాయి. కానీ వాటికి పరిష్కార మార్గాలను కనుగొనడంలో విఫలమయ్యారు. సెంట్రల్ పోర్టల్ అంతే ఉంటుందంటూ మిగిలిన కార్యాలయాల్లోనూ సారథి పోర్టల్ అమలు చేశారు. దీంతో సారథి సమస్యల వలయంలో చిక్కుకున్నది. స్లాట్ బుక్ చేయాలంటే వాహనదారులకు తలకు మించిన భారంగా మారింది. స్వతహాగా స్లాట్ బుక్ చేసుకోలేని విధంగా టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి.
ఒక్క స్లాట్ బుక్ చేయాలంటే గంటకుపైగా సమయం తీసుకుంటుంది. అందులోనూ నాలుగైదు సార్లు ఓటీపీలు ఎంటర్ చేయాల్సి వస్తున్నది. అవి సకాలంలో రాక మళ్లీ మళ్లీ ఓటీపీలు వస్తుండటంతో తీరా ప్రాసెస్ సమయం ముగిసి మళ్లీ మొదటికొస్తున్నది. సారథీ స్లాట్ బుక్ చేయాలంటే ఏజెంట్లను ఆశ్రయించి రూ. వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. స్లాట్ బుకింగ్‌లో సమస్యలు వస్తుండటంతో వాహనదారులు ఏజెంట్లను ఆశ్రయించడానికే మోగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో సారథి సేవలు నిలిపివేసి సీఎఫ్ఎస్టీ పోర్టల్ సేవల వినియోగించడంపై యోచిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

