టాప్‌గేర్‌లో కారు
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. రెండు నెలల ముందే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగా..షెడ్యూల్ కంటే ముందే వారంతా నియోజకవర్గాన్ని చుట్టేసి తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేశారు.
- 15న అభ్యర్థులకు బీఫాంల అందజేత
- 16న గ్రేటర్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
- 17 నుంచి నియోజకవర్గంలో అభ్యర్థుల పాదయాత్రలు
- అభ్యర్థులకు పెరుగుతున్న మద్దతు.. జోరుగా చేరికలు
- భారీ మెజార్టీ లక్ష్యంగా సరికొత్త వ్యూహాలు
అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైన వేళ.. అధికార పార్టీ కారు టాప్‌గేరులో దూసుకుపోతున్నది. ఈ నెల 15న సీఎం కేసీఆర్ అభ్యర్థులకు బీఫాంలు అందజేయనుండగా, 16న గ్రేటర్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నియోజకవర్గాల ఇన్చార్జిలు, పార్టీ ముఖ్య నేతలకు 45 రోజుల ప్రణాళికలకు సంబంధించిన బాధ్యతలు అప్పగిస్తారు. అంతేకాకుండా 17 నుంచి అభ్యర్థులు పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లి సర్కారు అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించనున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు నియోజకవర్గంలో రోజు రోజుకు మద్దతు పెరుగుతుండగా, గులాబీ పార్టీలోకి జోరుగా చేరికలు సాగుతున్నాయి. కుల సంఘాల నుంచి మొదలుకుని కాలనీ సంఘాల వరకు అందరూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని, పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలుపించుకుంటామని ముక్తకంఠంతో తెలుపుతున్నారు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ)

సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ): ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. రెండు నెలల ముందే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగా..షెడ్యూల్ కంటే ముందే వారంతా నియోజకవర్గాన్ని చుట్టేసి తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. విపక్షాలు ఇంకా అభ్యర్థుల వెతుకులాటలోనే ఉండగా..అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫాంలు ఇచ్చేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఈ నెల 15న సీఎం కేసీఆర్ అభ్యర్థులకు పార్టీ బీ ఫాంలను అందజేస్తారు. ఆదివారం నుంచి పార్టీ పరంగా, ఇటు అభ్యర్థులంతా ప్రజల్లోనే ఉండేలా ప్రచారానికి పదును పెంచే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 16న గ్రేటర్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది.
ఇందులో నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలు, పార్టీ ముఖ్యనేతలతో 45 రోజుల ప్రణాళికలకు సంబంధించి బాధ్యతలు అప్పగిస్తారు. అంతేకాకుండా అభ్యర్థులు భారీ ఎత్తున పాదయాత్రలకు శ్రీకారం చుడతారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనను కరపత్రాలతో ప్రజల కండ్ల ముందు ఉంచి ఓటర్లకు చేరువ కానున్నారు. దీంతో పాటు పార్టీ మ్యానిఫెస్టోతో పాటు నియోజకవర్గంలో ప్రత్యేక మ్యానిఫెస్టోను రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్లనున్నారు. డివిజన్‌కు రెండు పార్టీ కార్యాలయాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ర్యాలీలు, బహిరంగ సభలకు సంబంధించిన ముందస్తు అనుమతులు, అభ్యర్థుల ప్రచారం, నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం, రోజువారీ ప్రచార శైలి, ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే ప్లాన్ తదితర అంశాలను రోజూవారీ నివేదిక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు అందజేయడం లాంటి వాటితో భారీ మెజార్టీతో గెలిచేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
కొనసాగుతున్న చేరికలు.. అభ్యర్థుల మద్దతు
గుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కొందరు.. ప్రతిపక్ష పార్టీల్లో అభ్యర్థుల నాన్చివేత ధోరణితో విసిగిపోయి మరికొందరు.. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. జూబ్లీహిల్స్, సనత్‌నగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని, పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలుపించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో అభ్యర్థులకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు సైతం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

