హైదరాబాద్‌లో దారుణం.. మహిళలు వాష్‌రూమ్‌లో ఉండగా వీడియోల చిత్రీకరణ
హైదరాబాద్ : మహిళలు వాష్‌రూమ్‌లో ఉన్న సమయంలో ఓ యువకుడు వీడియోలు చిత్రీకరించి, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.92లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మిథున్ దాస్.. రోడ్ నం.92లోని ఓ బోటిక్‌లో బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే బోటిక్‌లో ఉన్న వాష్‌రూమ్‌లో ఎవరికీ తెలియకుండా.. తన సెల్‌ఫోన్‌ను వీడియో మోడ్‌లో ఉంచాడు. దీంతో బోటిక్‌లో పని చేస్తున్న మహిళలు.. వాష్‌రూమ్‌కు వెళ్లగా ఆ దృశ్యాలు మొబైల్లో రికార్డు అయ్యాయి. ఇలా మిథున్ దాస్ పదుల సంఖ్యలో మహిళల వీడియోలను చిత్రీకరించి భద్రపరుచుకున్నాడు.
అయితే బోటిక్‌లో పని చేసి బంద్ చేసిన ఓ మహిళ ఫోన్‌కు మూడు రోజుల క్రితం ఓ వీడియోను పంపాడు. ఆ వీడియోను చూసి ఆమె షాక్‌కు గురైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మిథున్ దాస్ ఫోన్ నుంచి తనకు వీడియో రావడంతో.. నేరుగా అతన్నే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్లో వేరే మహిళలకు సంబంధించిన మరిన్ని వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

