రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి నేడు నోటిఫికేషన్
లక్కీడ్రా ద్వారా బండ్లగూడ, పోచారం ప్లాట్ల కేటాయింపు
హెచ్ఎండీఏ పరిధిలో ఈ–వేలం.. జిల్లాల్లో బహిరంగ వేలం
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఫ్లాట్ల వేలానికి సర్వం సిద్ధమైంది. బండ్లగూడ, పోచారంలోని ఫ్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. బండ్లగూడలో నిర్మాణం పూర్తయిన 419 ఫ్లాట్లను చదరపు అడుగుకు రూ.3 వేలు, అసంపూర్తిగా ఉన్న 1,082 ఫ్లాట్లను చదరపు అడుగుకు రూ.2,750, పోచారంలో పూర్తయిన 1,328 ఫ్లాట్లను చదరపు అడుగుకు రూ.2500, కొద్ది అసంపూర్తిగా ఉన్న 142 ఫ్లాట్లను చదరపు అడుగుకు రూ.2,250 చొప్పున వ్రికయించనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
ఎవరైనా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లక్కీడ్రా ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తారు. బండ్లగూడ, పోచారం కాకుండా హెచ్ఎండీఏ పరిధిలోని చందానగర్, జవహర్‌నగర్, గాజులరామారం ప్రాజెక్టుల్లో ఈ–ఆక్షన్ ద్వారా ఫ్లాట్లను విక్రయిస్తారు. ఇతర జిల్లాల పరిధిలో బహిరంగా వేలం నిర్వహిస్తారు. 2, 3 రోజుల్లో నోటిఫికేషన్ రానున్నది.
అటు.. రాజీవ్ స్వగృహ ఇండ్ల అమ్మకాల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం బీఆర్కేభవన్లో హౌసింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మధ్య తరగతి ప్రజలు ఈ ఇండ్లను కొనుగోలు చేస్తారని, సులభ దరఖాస్తుకు వీలుగా మాడ్యూల్ రూపొందించాలని సూచించారు. అప్లికేషన్ ప్రక్రియ అసాంతం ఆన్లైన్లోనే స్వీకరించాలని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

