సుల్తాన్‌బజార్, జూలై 22 : మెస్ డిపాజిట్ చెల్లించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించాలంటూ నిజాం కళాశాల విద్యార్థులు మంగళవారం ఆందోళన చేశారు. కళాశాలలో విద్యార్థులతో మెస్ డిపాజిట్లను చెల్లించుకొని 20 రోజులు గడుస్తున్న కళాశాల అడ్మినిస్ట్రేషన్ హాస్టల్ సౌకర్యం కల్పించకపోవడం ఎంత వరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.
తక్షణమే నిజాం కళాశాల హాస్టల్‌ను తెరవాలని మెస్ డిపాజిట్లు చెల్లించిన ప్రతి విద్యార్థికి హాస్టల్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. నిజాం కళాశాలలో చదువుతున్న డిగ్రీ రెండో, మూడో సంవత్సరం విద్యార్థులందరికీ హాస్టల్ సౌకర్యం కల్పించాలని కళాశాల ఆవరణలో చీకట్లో నిరసన చేపట్టారు.