Hyderabad | హైదరాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో హిమాయత్‌నగర్‌లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. విరసం నేత వరవరరావుకు ఈయన అల్లుడు.
వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ నివాసంతో పాటు ఎల్బీనగర్లోని రవిశర్మ ఇంట్లోనూ గురువారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు.