మణికొండ, ఫిబ్రవరి 14 ః డ్రగ్స్, అమ్మాయిల వీడియోల హర్డ్ డిస్క్‌లతో పోలీసులకు దొరికి తీవ్ర సంచలనం రేపిన మస్తాన్‌సాయి కేసులో పోలీసుల విచారణ సాగుతున్నది. కోర్టు అనుమతితో ఇటీవల కస్టడీకీ తీసుకున్న పోలీసులు శుక్రవారం నార్కోటిక్ డైరెక్టర్ హరిశ్చంద్రారెడ్డి సమక్షంలో మస్తాన్‌సాయికి అనేక కోణాల్లో ప్రశ్నలు సంధించారు. కాగా మస్తాన్ రెండు గంటల పాటు నోరు మొదపకుండా నిశ్శబ్దంగా ఉన్నట్టు తెలిసింది. ల్యాప్‌టాప్‌తో హర్డ్ డిస్క్‌ను తెరిచి చూపించగా అందులో ఉన్నవన్నీ తన వ్యక్తిగత వీడియోలని చెప్పినట్టు సమాచారం. దాదాపు రెండొందల మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలను హార్డ్‌డిస్క్‌లో ఒక్కొక్కరికి ఒక్కో ఫోల్డర్‌ను పెట్టి వారి పేర్లతో ఫోల్డర్ పేరును పెట్టాడని, అమ్మాయిలపై అత్యాచారం చేసే సమయంలోనూ వీడియోలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మస్తాన్‌సాయి ఓ డ్రగ్ అడిక్ట్‌తో పాటు సెక్స్ అడిక్టర్గా పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. అదేవిధంగా ఆడియో, వీడియో, స్కీన్ రికార్డింగ్ అంటూ పోల్డర్లు తన హార్డ్ డిస్క్‌లో పెట్టుకున్నట్లు తెలిసింది. ఆడియో, వీడియో, స్కీన్ రికార్డింగ్ అంటూ ఫోల్డర్లు పేర్లున్నట్లు గుర్తించారు. హర్డ్ డిస్క్‌లో వాట్సాప్ చాట్ వివరాలు పొందేందుకు చేసేందుకు పోలీసులు ఉన్నతాధికారుల నుంచి అనుమతి కోరుతామని తెలిపారు.
డ్రగ్స్ అడిక్టర్ మస్తాన్‌సాయి హర్డ్ డిస్క్‌లో నగరంలోనే అనేకమంది సంపన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేయించి ఆపై వారితో సెక్స్‌లో పాల్గొని ఆ తర్వాత అవన్నీ వీడియోలుగా తీసి పెట్టుకున్నాడని తెలిసింది. వీటిలో అనేక మంది సంపన్న కుటుంబాలకు చెందిన వారికే అధికంగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అదేవిధంగా బుల్లి తెర,వెండి తెరకు చెందిన అనేక మంది మహిళలు, అమ్మాయిల వీడియోలను వారి పేర్లతో కూడిన ఫోల్డర్లలో మస్తాన్‌సాయి హర్డ్‌డిస్క్‌లో పెట్టుకున్నాడు. అంతేకాకుండా కొంతమంది రాజకీయ ప్రముఖులకు చెందిన వీడియోలను సైతం సాయి హర్డ్ డిస్క్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈ హర్డ్‌డిస్క్‌లో ఉన్న వారి చిత్రాలను చూపుతూ నిత్యం వీరిని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవారని తెలుస్తుంది.