పండుగకు ముందే బొనాంజా వచ్చింది..

బేగంపేట్, అక్టోబర్ 9: విజయదశమి పండగ ముందస్తుగానే వినియోగదారుల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చింది. ప్రతి ఒక్కరిలో జోష్‌ను నింపుతోంది. ‘నమస్తే తెలంగాణ దినపత్రిక, తెలంగాణ టు డే’ ముందస్తుగా నిర్వహిస్తున్న దసరా వేడుకల్లో భాగంగా 8వ రోజు శనివారం బేగంపేట్‌లోని వరుణ్ మోటార్స్‌లో దసరా బొనాంజా డ్రాను సందడిగా నిర్వహించారు. వరుణ్ మోటార్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్సీ రాజు డ్రా తీసి విజేతలను ప్రకటించారు. వనస్థలిపురానికి చెందిన కిరాణస్టోర్ నిర్వాహకుడు రవీందర్ ఎల్ఈడీ టెలివిజన్‌ను గెలుచుకున్నారు.
శ్రీలక్ష్మి మొబైల్, రమేష్, కొండస్వామి, ఫ్రాన్సీస్లు గిఫ్ట్ హాంపర్లు గెలుచుకున్నారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఏడీవీటీ జీఎం సురేందర్‌రావు, ఏజీఎం రామకృష్ణ, వరుణ్ మోటార్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ రాంకుమార్, పద్మజ సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్, ట్రూ వాల్యూ సీజీఎం వెంకటేశ్వరావు, వరుణ్ మోటార్స్ అడ్మిన్ జీఎం సుజని, బేగంపేట్ వరుణ్ మోటార్స్ బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్‌లు పాల్గొన్నారు. ఈ షాపింగ్ బొనాంజాలో ఫ్రీడం హెల్దీ కుకింగ్ ఆయిల్స్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్స్ టైటిల్ స్పాన్సర్స్‌గా, సెలక్ట్ మొబైల్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్, నిలోఫర్ కేఫ్ మెయిన్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఎంతో గర్వంగా ఉంది..
వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు ముందుండే వరుణ్ మోటార్స్ మారుతీ సంస్థ వినియోగదారుల కోసం కొత్తగా పద్మజ సుజుకీ షోరూంను కూడా త్వరలో బేగంపేటలోనే ప్రారంభిస్తున్నాం. బేగంపేట్ వరుణ్ మోటార్స్‌లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల దసరా బొనాంజా డ్రా తీయడం ఎంతో గర్వకారణంగా ఉంది. -వినోద్, పద్మజ సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
క్రమశిక్షణగా బొనాంజా నిర్వహిస్తున్నారు..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల అధ్వర్యంలో దసరా బొనాంజాను క్రమశిక్షణతో నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. పత్రిక యాజమాన్యానికి, బహుమతులు గెలుచుకుంటున్న కస్టమర్లకు మా తరుపున శుభాభివందనాలు. నమస్తే తెలంగాణతో ఎనిమిది సంవత్సరాలుగా ఈ దసరా షాపింగ్ బొనాంజాలో భాగస్వాములుగా ఉండటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. – వరుణ్ మోటార్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్సీ రాజు
రెట్టింపు ఉత్సాహంతో షాపింగ్
ప్రతి సంవత్సరం దసరా బొనాంజాను ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుతున్నాం. ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున వినియోగదారులు షాపింగ్‌లు చేసి కూపన్లు పొంది బహుమతులు గెలుచుకోవాలి. -రామకృష్ణ, ఏజీఎం నమస్తే తెలంగాణ
టీవీ రావడం.. సంతోషంగా ఉంది
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బొనాంజా మా ఇంట పండుగ సంతోషాలను నింపింది. వరుణ్ మోటార్స్‌లో తీసిన డ్రాలో మొదటి బహుమతిగా ఎల్ఈడీ టీవీ రావడం ఆనందంగా ఉంది. – ఎల్ఈడీ టీవీ విజేత రవీందర్, వనస్థలిపురం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

