ఖైరతాబాద్, అక్టోబర్ 4: తెలంగాణ గుండె చప్పుడు ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ పత్రికల దసరా కానుకల వేడుక ఉత్సాహంగా కొనసాగుతోంది. లక్డీకాపూల్ సయ్యద్ ప్లాజాలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు జోనల్ కార్యాలయంలో మూడో రోజుకు సంబంధించి సోమవారం సాయంత్రం కూపన్ల ఫలితాలను వెల్లడించారు. దసరా షాపింగ్ బొనాంజా ఫలితాల వెల్లడికి ముఖ్య అతిథిగా పంజాబ్ నేషనల్ బ్యాంకు జోనల్ మేనేజర్ సంజీవన్ నిఖర్ హాజరయ్యారు. సంజీవన్ నిఖర్ మొదటి విజేతను ప్రకటించగా, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వైస్ ప్రెసిడెంట్ డి.చిరంజీవి రెండో విజేత, ఇతర విజేతలను జనరల్ మేనేజర్ ఎన్.సురేందర్ రావు, పీఎన్బీ డిప్యూటీ జోనల్ మేనేజర్ స్వరాజ్యలక్ష్మిలు కూపన్ల ద్వారా మరికొందరిని ఎంపిక చేశారు.
32 ఇంచుల ఎల్ఈడీ టీవీని చింతల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ డి.మణిశేఖర్ రెడ్డి (కూ.నం. 026897), మొబైల్ ఫోన్‌ను జి.దృతి (కూ.నం. 027708), గిఫ్ట్ వోచర్లను మేదు సుబ్రహ్మణేశ్వర్, బత్తుల వంశీలు, జగదీశ్వర్లు గెల్చుకున్నారు. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘దసరా షాపింగ్ బొనాంజా’లో సీఎంఆర్, కేఎల్ఎం, ఫ్రీడం హె ల్తీ కుకింగ్ ఆయిల్స్, కేఫ్ నిలోఫర్, సెలెక్ట్ మొబైల్స్, కున్ హ్యుం డై, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, యూనియన్ బ్యాంకు, పంజాబ్ నేషన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా భాగస్వాములు గా, టీ న్యూస్ (మీడియా పార్ట్నర్), హైబిజ్ టీవీ (డిజిటల్ పార్ట్నర్), హోప్ అడ్వర్టయిజింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లు క్రియేటీవ్ పార్ట్నర్లుగా వ్యవహరిస్తున్నాయి. కార్యక్రమంలో అడ్వైర్టెజ్‌మెంట్ ఏజీ ఎం రాజిరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ సందీప్ జోషి పాల్గొన్నారు.
‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’తో దసరా షాపింగ్ బొనాంజాలో భాగస్వామిగా మా బ్యాంకు ఉండటం సంతోషంగా ఉంది. గెలుపొందిన విజేతలకు అభినందనలు. బతుకమ్మ, దసరా, ఈద్, దీపావళి, క్రిస్మస్ సందర్భంగా ఫెస్టివల్ బొనాంజా ప్రవేశపెట్టాం. అతి తక్కువ వడ్డీతో అన్ని రకాల రుణాలను ఇస్తున్నాం. గృహ రుణానికి 6.60, కార్కు 7.15, పర్సన్ లోన్ 8.95 శాతం ఇంటరెస్ట్ రేట్‌తో అందిస్తున్నాం. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు ఉంటుంది. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి.
మాది మహబూబ్‌నగర్ జిల్లా శ్రీనివాస్ కాలని. దసరాకు బట్టలు కొనుగోలు చేయాలని ప్రత్యేకంగా నగరంలోని చింతల్లో మా బంధువుల ఇంటికి వచ్చాను. సీఎంఆర్ షాపింగ్ మాల్లో రూ.12,900 విలువైన చీరలు కొనుగోలు చేశాను. బిల్లుతో పాటు ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ పేరుతో ఉన్న దసరా షాపింగ్ బొనాంజా కూపన్ అందించారు. నేను షాపింగ్ చేసిన మొదటి సారిగా కూపన్లో నా పేరు, వివరాలను చేర్చి గిఫ్ట్ బాక్సులో వేశాను. ఇది సాధారణంగానే ఉంటుందని అనుకున్నా. దసరా సందర్భంగా 32 ఇంచుల ఎల్ఈడీ టీవీ బహుమతిగా వస్తుందని ఊహించలేదు. ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’కు కృతజ్ఞతలు. డి.మణిశేకర్ రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజినీర్
వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ షాపింగ్ మాళ్లు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు కొత్త స్కీములను తీసుకొస్తున్నాయి. డిస్కౌంట్లు, నాణ్యమైన వస్తువుల లాంటి వాటి సమాచారాన్ని ప్రజలకు చేరేసేందుకు ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ వారధిగా నిలిచింది. కొనుగోలు చేసే వస్తువులపై బ్యాంకు రుణాలు సైతం అందుబాటులో ఉండటంతో ఈ దసరా బొనాంజాకు బ్యాంక్ ఆఫ్ బరో డా, పంజాబ్ నేషనల్, యూనియన్ బ్యాంకులు అసోసియేట్ పార్ట్నర్లుగా రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. ఈ వేడుకల్లో పారదర్శకంగా డ్రా తీసి బహుమతులను అందజేస్తున్నాం. ఇలా పదకొండో రోజు బంపర్ బహుమతిగా విలువైన కారును అందజేస్తాం. – డి.చిరంజీవి, వైస్ ప్రెసిడెంట్, ‘నమస్తే తెలంగాణ’
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రుణ సౌకర్యం పొందడం ఎంతో సులభతరం. సాధారణంగా బ్యాంకుల్లో రుణాలు పొందాలంటే అనేక అడ్డంకులు ఉంటాయి. నా సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఈ బ్యాంకును సంప్రదించగా, కేవ లం 15 నుంచి 20 రోజుల్లో నాకు కావాల్సిన రూ.1.20 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. అనుకున్న దానికంటే మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అత్యుత్తమ సర్వీసు ఇస్తున్న పీఎన్బీకి కృతజ్ఞతలు. – సాకేత్ అగర్వాల్, సనత్‌నగర్, వ్యాపారి