వితంతు, వారి కుమార్తెల వివాహాలకు ఆర్థిక సాయం
వితంతు, వారి కుమార్తెల వివాహాలకు ఆర్థికసాయం చేసేందుకు ముత్తూట్ ఫైనాన్స్ ముందుకు వచ్చింది. దేశంలో అతిపెద్ద గోల్డ్ లోన్ కంపెనీ అయిన ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వివాహసన్మానం అనే ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపింది.
- దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ముత్తూట్ ఫైనాన్స్
సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): వితంతు, వారి కుమార్తెల వివాహాలకు ఆర్థికసాయం చేసేందుకు ముత్తూట్ ఫైనాన్స్ ముందుకు వచ్చింది. దేశంలో అతిపెద్ద గోల్డ్ లోన్ కంపెనీ అయిన ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వివాహసన్మానం అనే ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపింది. ఇందులో భాగంగా వితంతువులైన తల్లులకు వారి కుమార్తెల పెండ్లి కోసం ఆర్థిక సహాయం అందించడానికి సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు రూ.50వేల సాయాన్ని పొందనున్నారు.
బెంగళూరు, హైదరాబాద్, మధురై, మంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ వంటి ఒక్కో నగరం నుంచి 80 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల నెలవారి ఆదాయం రూ.10వేల కంటే తక్కువగా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.40లక్షల గ్రాంట్‌ను ముత్తూట్ వివాహసన్మానం ప్రాజెక్టుకు కేటాయించినట్లు సీఎస్ఆర్ హెడ్ బాబుజాన్ మలయిల్ తెలిపారు. డిసెంబర్ 25న సాయంత్రం 5.30గంటలోపు హిమాయత్‌నగర్‌లోని గ్రాండ్‌పాస్ రాయల్ మాన్షన్‌లో గల జోనల్ కార్యాలయం 3-6-2/1/1, 2వ అంతస్తులో గానీ లేదా 92880 03602 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

