DGP CV Anand | నిజాయితీ, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలి.. డీఎస్పీలతో డీజీపీ సీవీ ఆనంద్
DGP CV Anand | పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని, అంతకుమించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించే అవకాశం అని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు.
DGP CV Anand, | హైదరాబాద్, జూన్ 29 : తెలంగాణ పోలీసు శాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) హోదా నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా పదోన్నతి పొందిన 36 మంది అధికారులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, యూనిట్లలో పోస్టింగ్‌లు కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్, డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతనంగా పదోన్నతి పొందిన అధికారులను అభినందించారు.
డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని, అంతకుమించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించే అవకాశం అని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల సమస్యలను సత్వరమే గుర్తించి, చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించే దిశగా పనిచేయాలని, ప్రజలకు చేరువయ్యే అధికారులుగా మంచి పేరు తెచ్చుకోవాలని డీజీపీ సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజలతో సత్సంబంధాల పెంపు, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన కోరారు. డీఎస్పీ హోదాలో ప్రతి నిర్ణయం ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా ఉండాలని, ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించాలని ఆయన తెలిపారు.
ప్రజల భద్రత, సంక్షేమమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా అంకితభావంతో పనిచేస్తేనే వృత్తిపరంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. కాగా సీఐల నుండి డీఎస్పీలుగా పదోన్నతి పొందిన వీరికి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోస్టింగ్స్ కాకుండా ఇతర విభాగాల్లో తమ సేవలను నిర్వహించనున్నారు.
Read Also :
New rules | ఐటీఆర్ నుంచి ఆధార్, క్రెడిట్ కార్డుల వరకు.. జూలై ఒకటో తేదీ నుంచి మారనున్న కొన్ని రూల్స్..!
India’s Market | మళ్లీ ఐదో ర్యాంకుకు చేరిన భారత ఈక్విటీ మార్కెట్.. కారణాలు ఇవే..!
‘యంగ్ ఇండియా స్కూల్ కొత్తగూడెం నియోజకవర్గానికి కీర్తి పతాక’
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

