హద్దులు దాటిన ఎంఆర్డీసీఎల్
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపైన కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి వీడటంలేదు. మూసీ సుందరీకరణ పేరిట ప్రజల ఆస్తులను కొల్లగొట్టడంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. నిబంధనలు ఉల్లంఘిస్తూ పనులు చేస్తూనే ఉంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు అధికారికంగా బహిర్గతం చేయకుండా భూసేకరణ చేపట్టవద్దని ఆదేశించింది. అయినా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ తన పని తాను చేసుకుపోతున్నది.
- డీపీఆర్ లేకుండానే మూసీపై ముందుకు
- ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ రివర్బెడ్, బఫర్‌జోన్ గుర్తింపు
- చదును చేసి హద్దురాళ్ల ఏర్పాటు
- ఆందోళనలో మూసీ పరీవాహక ప్రజలు
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపైన కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి వీడటంలేదు. మూసీ సుందరీకరణ పేరిట ప్రజల ఆస్తులను కొల్లగొట్టడంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. నిబంధనలు ఉల్లంఘిస్తూ పనులు చేస్తూనే ఉంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు అధికారికంగా బహిర్గతం చేయకుండా భూసేకరణ చేపట్టవద్దని ఆదేశించింది. అయినా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ తన పని తాను చేసుకుపోతున్నది. ఇప్పటికే హిమాయత్‌సాగర్ నుంచి బాపుఘాట్ దాకా మూసీకి ఇష్టానుసారంగా సరిహద్దులు నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలకు నచ్చిన విధంగా రివర్బెడ్, బఫర్జోన్లను నిర్ణయించారని ఆరోపించారు. విలువైన భూములు ఉన్నచోట బఫర్ జోన్ పరిధిని పెంచుతూ..హద్దులు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఎంఆర్డీసీఎల్ సిబ్బంది ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్‌కు రివర్బెడ్, బఫర్‌జోన్ పరిధులను నిర్ణయిస్తూ హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
-సిటీబ్యూరో
గండిపేటలోని ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ దాకా ఎంఆర్డీసీఎల్ అధికారులు మూసీ పరీవాహక ప్రాంతాన్ని చదును చేస్తున్నారు. పరిసరాల్లో ఉంటున్న ప్రజలను సంప్రదించకుండానే పనులు వేగంగా పనులు చేసుకుంటూ పోతున్నారు. ఏండ్ల తరబడిగా మూసీ పరీవాకంలో నివసిస్తున్న తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇండ్ల చుట్టూ ఉన్న భూములను చదును చేసి రాళ్లు పాతుతుండటంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు రివర్బెడ్, బఫర్‌జోన్ పేర్లను హద్దు రాళ్లు వేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు.
ఏండ్ల నాటి నుంచి నివసిస్తున్న తమ ఇండ్లను కూలుస్తారేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచి ఏపక్ష ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ఏ ఒక్క పనిలో తమ నిర్ణయాలు, అభిప్రాయాలు తీసుకోకపోవడంతో తమ ఆస్తులను కోల్పోతామనే భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు పేరిట తమ ఆస్తులను లాక్కొనేందుకు బఫర్, ఎఫ్టీఎల్లను ఇష్టానుసారం మారుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీపీఆర్ ప్రకటించేదాకా హద్దులు నిర్ణయించడం, భూములను చదును చేసే పనులు చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు వెళ్తే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
కలెక్టర్ దగ్గరే డీపీఆర్ లేకుంటే ఎలా?
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ కలెక్టర్ దగ్గరే లేదు. ఇటీవల మాతో కలెక్టర్ సమావేశం అయినప్పుడు డీపీఆర్ చూపించండి అని అడిగితే ఎలాంటి సమాధానం లేదు. ఉన్నతాధికారుల వద్దనే ప్రాజెక్టు వివరాలు లేకుండా మూసీకి హద్దులు ఎలా నిర్ణయిస్తారు? హద్దుల పేరిట భూములను చదను చేస్తూ మమ్మల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంఆర్డీసీఎల్, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా మూసీ పరీవాహకంలోని ఒక్క గజం భూమి కూడా వదులుకోం. ముందుగా ప్రజలు అభిప్రాయాలు తీసుకుని అందుకు అనుగుణంగా ప్రాజెక్టును చేపట్టాలి. లేదంటే పరీవాహక ప్రాంతాల ప్రజలంతా ఏకమై పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాం.
– ఆంజనేయులు, మాజీ సర్పంచ్, హిమాయత్‌సాగర్
మూసీ పేరిట రేవంత్ సర్కార్ భూదందా
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు డీపీఆర్‌ను ప్రజల ముందు ఉంచకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది. పరీవాహకంలోని విలువైన భూములను లాక్కొనేందుకే సుందరీకరణ పేరిట డ్రామా చేస్తున్నారు. మా భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పేరిట హద్దులు ఏర్పాటు చేసినా ఎట్టి పరిస్థితుల్లో భూములను వదులుకోబోం. ముందుగా మా భూములకు విలువైన భూమి ఇస్తేనే మూసీ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తాం. అధికారులు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మా వివరణ తీసుకోకుండా రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు. ఎన్ని కుట్రలు చేసినా భూములను ఇవ్వం.
– శివశంకర్, హైదర్‌గూడ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

