e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home క్రైమ్‌ భార్యను హతమార్చి.. ఉరి వేసుకుని భర్త మృతి

భార్యను హతమార్చి.. ఉరి వేసుకుని భర్త మృతి

భార్యను హతమార్చి.. ఉరి వేసుకుని భర్త మృతి

బొల్లారం, మే 23 : మద్యం మత్తులో భార్యను బండరాయితో మోది హతమార్చి… తానూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ శ్రావణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. తిరుమలగిరి గాంధీనగర్‌ బస్తీకి చెందిన ఆల్బర్ట్‌(41), రేఖ(39) భార్యాభర్తలు. వీరికి సోనీ కుమార్తె(వివాహిత), లాజర్‌(కుమారుడు) పదినెలల కిందట ఆత్యహత్య చేసుకున్నాడు. ఆల్బర్ట్‌ పెయింటర్‌ కాగా రేఖ కూలీ పనిచేస్తుంది. గత కొంత కాలంగా మద్యానికి బానిసైన ఆల్బర్ట్‌ తరుచూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇరువురు శనివారం అర్ధరాత్రి గొడవపడ్డారు. ఆల్బర్ట్‌ బండరాయితో రేఖ తలపై మోదడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆల్బర్ట్‌ ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోయిన్‌పల్లిలో నివాసముంటున్న కుమార్తె వీరికి రాత్రి నుంచి ఫోన్‌ చేస్తున్నప్పటికీ ఎంతకీ ఎత్తకపోవడంతో ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి తల్లితండ్రులు విగత జీవులుగా పడి ఉన్నారు. దీంతో కన్నీరుమున్నీరైన కూతురు పోలీసులకు సమాచారమందించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భార్యను హతమార్చి.. ఉరి వేసుకుని భర్త మృతి

ట్రెండింగ్‌

Advertisement