మెట్రో పయనమెటు?
ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్-ప్రైవేటు-పార్ట్నర్షిప్ మెట్రో ప్రాజెక్టు.. నిన్నటిదాకా ఇలా మనం గర్వంగా చెప్పుకున్న హైదరాబాద్ మెట్రో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. హైదరాబాద్ మహా నగరానికి విశ్వ నగర ఖ్యాతిని తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ బృహత్తర ప్రాజెక్టు ఇప్పుడు ‘మహాలక్ష్మి’ పథకంతో విలవిలలాడుతున్నది.
- సీఎం రేవంత్ వ్యాఖ్యలతో మరింత గందరగోళం
- ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోదనే స్పష్టమైన సంకేతం
- ఎల్అండ్టీకి సాధ్యంకానిది ఇతర సంస్థలకు సాధ్యమా?
- ఈ ప్రభావం విస్తరణ ప్రాజెక్టులపైనా ఉంటుందంటున్న నిపుణులు
ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్-ప్రైవేటు-పార్ట్నర్షిప్ మెట్రో ప్రాజెక్టు.. నిన్నటిదాకా ఇలా మనం గర్వంగా చెప్పుకున్న హైదరాబాద్ మెట్రో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. హైదరాబాద్ మహా నగరానికి విశ్వ నగర ఖ్యాతిని తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ బృహత్తర ప్రాజెక్టు ఇప్పుడు ‘మహాలక్ష్మి’ పథకంతో విలవిలలాడుతున్నది. ఇక.. మెట్రోను తాము నిర్వహించలేమంటూ ప్రతిష్ఠాత్మకమైన ఎల్అండ్టీ సంస్థ చేతులెత్తేస్తున్న నేపథ్యంలో అందరూ రాష్ట్ర ప్రభుత్వం వంక ఆశగా ఎదురుచూశారు. పరిస్థితిని చక్కదిద్దడంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని భావించారు. కానీ ‘అమ్ముకుంటే అమ్ముకోనీ’ అంటూ.. సీఎం రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టడంతో హైదరాబాద్ మెట్రో పయనమెటు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొనేవారుంటే పర్వాలేదు! కానీ ఎల్అండ్టీతోనే సాధ్యం కానిది మాకెలా?! అని ఎవరూ ముందుకురాకపోతే ఎల్అండ్టీ వేసే తదుపరి అడుగు ఎలా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదే క్రమంలో నగరం నలువైపులా విస్తరిస్తుందనుకుంటున్న మెట్రో రైలు ప్రాజెక్టుపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 15 (నమస్తే తెలంగాణ) :
ఆధునిక ప్రజా రవాణాకు చిరునామాగా మారిన మెట్రో రైలు ప్రాజెక్టుపై హైదరాబాద్ వేదికగా పడిన తొలి అడుగు అంతర్మథనంలో పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారడం సగటు నగరవాసిని కలిచివేస్తున్నది. అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి పథకం’తో పురోగమన దిశగా ఉన్న ప్రయాణికుల సంఖ్య తిరోగమనంలో పడిపోయిందని, ఈ క్రమంలో తాము మెట్రో రైలును అమ్ముకుంటామంటూ ఎల్అండ్టీ సంస్థ చేసిన ప్రకటన సంచలనం రేకెత్తించింది. వాస్తవానికి దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న మెట్రో ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాయి. కానీ హైదరాబాద్ మెట్రో రైలు మాత్రం అందుకు భిన్నం. ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాతిపదికన ఏర్పాటైన ప్రాజెక్టు కావడంతో ఇందులో 90 శాతం ఎల్అండ్టీ సంస్థ భాగస్వామ్యం ఉండగా.. మిగిలిన పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిది. ప్రాజెక్టు రూపకల్పన దశలో వయబుల్ గ్యాప్ ఫండింగ్ (వీజీపీ) కింద రూ.వెయ్యి కోట్లకు పైగా కేంద్రం నుంచి నిధులు వచ్చేలా అంగీకారం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.254 కోట్ల బకాయిలను పదేండ్లుగా విడుదల చేయలేదు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి లేదనేది సుస్పష్టం. ఇక మిగిలిందల్లా.. రాష్ట్ర ప్రభుత్వం! కానీ దీనిపైనా రెండు రోజుల కిందట సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఎల్అండ్టీ మెట్రోను అమ్ముకుంటే అమ్ముకోనీ.. మనమేం చేస్తం! అని చేతులెత్తేసినట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో మెట్రో నిర్వహణ అనేది ఎల్అండ్టీ చేయాలి.. లేకపోతే ఇతర సంస్థలకు అమ్ముకోవాలి. అయితే ఎల్అండ్టీ లాంటి దిగ్గజ సంస్థనే చేతులెత్తేసి, మెట్రోను అమ్ముతుంటే ధైర్యంగా ముందుకొచ్చి తీసుకునే ప్రైవేటు సంస్థ ఉంటుందా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య తగ్గినందున విక్రయిస్తున్నామంటూ ఆ సంస్థ ప్రకటించిన తర్వాత ఇతర సంస్థలు నష్టాల్లో కూరుకుపోయే దానిని తీసుకునేందుకు ఎలా ముందుకొస్తాయని చెబుతున్నారు. మరి.. ఇదే జరిగితే ఎల్అండ్టీ నష్టాలను భరిస్తూ మెట్రోను ముందుకు తీసుకుపోవడం సందేహంగానే ఉందని, ఈ సాకుతో ఆ సంస్థ పూర్తిగా చేతులెత్తేస్తే?! అనేది ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్న ఆందోళన.
విస్తరణ ప్రాజెక్టు భవితవ్యమేంది?
ప్రస్తుతం నగరంలో మూడు కారిడార్లలో 66 కిలోమీటర్ల మేర మెట్రో ఉంది. దీనిని మరో 70 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. పార్లమెంటు ఎన్నికల కోడ్‌కు ముందుగానే అట్టహాసంగా శంకుస్థాపన కూడా చేసింది. అయితే ఈ విస్తరణ ప్రాజెక్టులు అన్నింటికీ మూలాధారం.. ప్రస్తుతం ఉన్న మెట్రోనే. పాత అలైన్‌మెంట్‌కు అనుసంధానంగానే విస్తరణ ప్రాజెక్టుల అలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఈ క్రమంలో మూలాధారమైన అలైన్మెంట్ నిర్వహణనే గందరగోళంగా మారితే అనుసంధాన-విస్తరణ అలైన్మెంట్ల నిర్వహణ అనేది ప్రహసనంగా మారుతుంది. ఒకవేళ విస్తరణ ప్రాజెక్టుల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే.. వాటికి అనుసంధానం చేసేందుకు ఎల్అండ్టీ తన నష్టాలను ముందుపెట్టే అవకాశముంది. అలాకాదని ప్రభుత్వం ఎల్అండ్టీకి అప్పగించాలనుకుంటే ఉన్న దానికే దిక్కులేదనే సాకు చూపుతుంది. ఇవన్నీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిర్వహించే ఆర్థిక స్థితిగానీ, అనుకూల పరిస్థితులుగానీ లేవనేది సీఎం రేవంత్ ప్రకటన ద్వారానే స్పష్టమవుతుంది. ఇలా హైదరాబాద్ మెట్రో రైలు చుట్టూ అనేక రకాల సందేహాలు, అనుమానాలు కమ్ముకోవడంతో మనుగడ ఎలా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

