సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు పబ్‌లో ఏం జరిగిందనే విషయాన్ని ఆరా తీసేందుకు నెల రోజుల సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. ఉప్పల్ అభిషేక్, మేనేజర్ అనిల్‌కుమార్ కస్టడీపై న్యాయస్థానంలో విచారణ జరిగినా, తీర్పు సోమవారానికి వాయిదా పడింది. మరోవైపు పబ్‌లో డీజేలు డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు బయటపడుతున్నది. డీజేలు, మేనేజర్, యజమానులకు మధ్య ఎలాంటి సంబంధాలున్నాయనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అనిల్‌కుమార్, అభిషేక్‌ల ఫోన్లను విశ్లేషించేందుకు ప్రయత్నించగా, నాలుగు ఫోన్లలో రెండింటికి లాక్‌లు ఉన్నట్లు తెలిసింది.