TGSRTC | ‘బస్సులో భరోసా’.. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో నిఘా నేత్రాలు
TGSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) నాగిరెడ్డి సరికొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చారు. ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలు లేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చూసేందుకు బస్సుల్లో అత్యాధునిక సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఏర్పాటుకు ఆయన శ్రీకారం చుట్టారు.
TGSRTC | ప్రజల ప్రయాణానికి భద్రత, నమ్మకానికి ప్రతీకగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల రక్షణ కోసం మరో విప్లవాత్మక నిర్ణయంతో ముందుకొచ్చింది. ప్రమాదాలు, చోరీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) నాగిరెడ్డి సరికొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చారు. ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలు లేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చూసేందుకు బస్సుల్లో అత్యాధునిక సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ ఏర్పాటుకు ఆయన శ్రీకారం చుట్టారు.
పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ “బస్సులో భరోసా” పేరిట రూపొందించిన ఈ సరికొత్త హైటెక్ భద్రతా ప్రాజెక్టును తొలి దశలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సరికొత్త భద్రతా వ్యవస్థ కింద ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో ఈ అత్యాధునిక నిఘా నేత్రాలను అమర్చారు. డ్రైవర్ క్యాబిన్ సమీపం, మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక సీట్లు, ఫుట్బోర్డుతో పాటు బస్సు లోపల చివరి సీటు వరకు ప్రతి అంగుళం స్పష్టంగా కవర్ అయ్యేలా ఈ కెమెరాలను ప్రత్యేక సాంకేతికతతో అమర్చడం విశేషం.
నిరంతరం పర్యవేక్షించేలా..
బస్సు ఎక్కే ప్రతి వ్యక్తి ముఖ కదలికల నుంచి ప్రయాణంలో జరిగే ప్రతి చిన్న యాక్టివిటీ వరకు అన్నీ ఇందులో రికార్డు అవుతాయి. ఈ విజువల్స్ అటు డ్రైవర్, కండక్టర్లకు అందుబాటులో ఉండటమే కాకుండా ఆర్టీసీ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా కనెక్ట్ చేశారు. దీనివల్ల బస్సుల్లో దొంగతనాలు చేసే ముఠాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ముందే గుర్తించి అప్రమత్తం కావడానికి, ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన లేదా ప్రమాదం జరిగితే తక్షణమే ఖచ్చితమైన ఆధారాలను సేకరించడానికి ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడనుంది.
మహిళా ప్రయాణికులపై వేధింపులు, దొంగతనాలు, అనుచిత ప్రవర్తన వంటి ఘటనలకు చెక్ పెట్టేలా టీజీఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో సుదూర ప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధులు ఈ నిఘా కన్ను ఏర్పాటు పట్ల తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గుబులు పుట్టిస్తుందని..
బస్సులో సీసీ కెమెరా ఉందనే భయం నేరగాళ్లలో గుబులు పుట్టిస్తుందని, ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుందని ప్రజలు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ కెమెరాల ఏర్పాటు వల్ల డ్రైవింగ్ ప్రమాణాలు కూడా మెరుగవుతాయని, సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు సాధించే ఫలితాలను బట్టి, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల బస్సులకు ఈ సీసీ కెమెరాల రక్షణ కవచాన్ని విస్తరించడానికి టీజీఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రజల భద్రత కోసం సాంకేతికతను జోడించి సంస్థను ప్రగతి పథంలో నడిపిస్తున్న ఎండీ నాగిరెడ్డి ఆలోచనా సరళిపై ప్రయాణికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also :
Kohinoor Diamond | గోల్కొండ నుంచి బ్రిటన్ దాకా.. కోహినూర్ వజ్రం ప్రయాణంపై చరిత్ర చెబుతున్న నిజాలివీ!
Dehydration | వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు..
Peddi | ‘హల్లల్లల్లో’తో సోషల్ మీడియాలో పెద్ది మేనియా.. చరణ్ స్టెప్పులు, మాస్ బీట్తో సాంగ్ వైరల్!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

