సిటీబ్యూరో: నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కల్పించేందుకు బల్దియా విశేషంగా కృషి చేస్తున్నది. ప్రజల అవసరాలను, అవశ్యకతను గుర్తించి కావాల్సిన మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తున్నారు. రూ. 52.72 కోట్లతో 29 చోట్ల మోడల్ కారిడార్లకు శ్రీకారం చుట్టారు. ఆరు జోన్ల పరిధిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
వెండింగ్ జోన్లు, గ్రీనరీ, పారింగ్, ైస్లెకింగ్ ట్రాక్లు, విశాలమైన ఫుట్పాత్లు, పాదచారులు సేద తీరేలా ఫర్నీచర్ ఇలా ప్రత్యేకతలతో కారిడార్లను ఏర్పాటు చేస్తున్నారు. 16 చోట్ల 19.54 కిలోమీటర్ల మేర చేపట్టిన పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వచ్చే నెలాఖరు నాటికల్లా పూర్తి చేసి తొలి విడతగా మోడల్ కారిడార్లను అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇదే సమయంలో రూ. 27.94 కోట్లతో 9 చోట్ల పనుల కోసం టెండర్ ప్రక్రియను పూర్తి చేసి త్వరలో ప్రారంభించేలా సన్నద్ధమవుతున్నారు.