Dasoju Sravan Kumar | బాల్క సుమన్ మాట్లాడింది తప్పైతే.. రేవంత్ రెడ్డి మాట్లాడింది ఎందుకు తప్పు కాదు : ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్
Dasoju Sravan Kumar | ఒక దళిత బిడ్డ సింగరేణి కాలరీస్‌లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అక్కడున్న అవినీతికి వ్యతిరేకంగాఒక మాట ఏదో అంటే అదో పెద్ద నేరమైనట్టుగా బాల్క సుమన్‌ను తీసుకొచ్చి జైలులో బంధించారన్నారు బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్.
Dasoju Sravan Kumar |సింగరేణి బొగ్గు గనుల సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలను, దోపిడీని బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ ను అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. చంచల్ గూడ జైలులో బాల్క సుమన్‌ను ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక దళిత బిడ్డ సింగరేణి కాలరీస్‌లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అక్కడున్న అవినీతికి వ్యతిరేకంగాఒక మాట ఏదో అంటే అదో పెద్ద నేరమైనట్టుగా బాల్క సుమన్‌ను తీసుకొచ్చి జైలులో బంధించారన్నారు. ఏ చట్టం ప్రకారమైతే సుమన్ నేరస్థుడని జైలులో పెట్టారో.. మరి అదే చట్టం రేవంత్ రెడ్డికి ఎందుకు వర్తించదన్నారు. లాగుల తొండలేస్తా అంటే రజాకార్ల భాష, పొట్ట చీల్చి పేగులు మెడలో వేసుకొని తిరుగుతా అంటే రౌడీ భాష, తొక్కుతా అంటే క్రిమినల్ భాష. రాళ్లతో కొట్టండి అని కార్యకర్తలకు పిలుపునిస్తే అది క్రిమినల్ భాష అని దాసోజ్శ్రవణ్ కుమార్ అన్నారు.
సింగరేణి కాలరీస్‌లో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నయి. అక్కడున్న కార్మికులకు అనేక కష్టనష్టాలున్నాయని, సింగరేణి కార్మికులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తను ఒక మాట అంటే అది మొత్తం నేరమైనట్టు జైలులో పెట్టారు. తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరముంది. ఒకవేళ సుమన్ మాట్లాడింది తప్పే అయితే మరి రేవంత్ రెడ్డి మాట్లాడింది ఎందుకు తప్పు కాదు.. ఆయన పేరు మీద ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయరని దాసోజ్శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.
బహిరంగ సభల్లో నిత్యం అసభ్య పదజాలంతో, బూతులతో విరుచుకుపడే రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా కేసులు పెట్టి తక్షణమే వాళ్ళను జైళ్లకు పంపాలని దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇవ్వాళ భారత రాజ్యాంగం అమలు కావడం లేదు.. కేవలం రేవంత్ రెడ్డి ఫాసిస్ట్ రాజ్యాంగమే నడుస్తోందన్నారు.
Live: చంచల్‌గూడ జైలులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో ములాఖత్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు@sravandasoju https://t.co/m0dHMwQ5DH
— BRS Party (@BRSparty) June 9, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

