Home
Hyderabad
Mlas Kaleru Venkatesh And Mutha Gopal Said That It Was Vivekananda Who Showed The Greatness Of The Country To The World
యువత వివేకాందను స్ఫూర్తిగా తీసుకోవాలి
యువత స్వామి వివేకాందను స్ఫూర్తిగా తీసుకోవాలని, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద అని ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ పేర్కొన్నా రు.
- దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు: ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్
అంబర్‌పేట/ముషీరాబాద్/చిక్కడపల్లి/గోల్నాక/కవాడిగూడ/సుల్తాన్‌బజార్/అబిడ్స్, జనవరి 12: యువత స్వామి వివేకాందను స్ఫూర్తిగా తీసుకోవాలని, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద అని ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్ పేర్కొన్నా రు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ రెడ్‌బిల్డింగ్ చౌరస్తాలో నిర్వహించిన వివేకానంద జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- స్వామి వివేకానండుడి జయంతి సందర్భంగా శుక్రవారం గోల్నాక డివిజన్ గంగానగర్ నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవానికి బాగ్‌అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకట్రెడ్డితో కలసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరై.. వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- గాంధీనగర్ వివేకాజ్యోతి సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్వామి వివేకానంద జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సేవా సమితి అధ్యక్షుడు దశరథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జయసింహ, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్‌కుమార్, సాయి సె క్యూరిటీ అధినేత స్వామి, బీజేపీ నాయకులు రత్నసాయి చంద్, నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్ గుప్తా, ఆనంద్ పాల్గొన్నారు.
- రెడ్‌బిల్డింగ్ చౌరస్తాలో బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు ఏడెల్లి బాలు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు జరిగాయి. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డా.ఎన్.గౌతంరావు, మాజీ మం త్రి సి.కృష్ణాయాదవ్‌లు పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఫాతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓల్డ్ నల్లకుంట పాతరామాలయం వద్ద గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద జయంతి వేడుకలను జరిపారు. కార్పొరేటర్లు వై.అమృత, కన్నె ఉమారమేశ్యాదవ్ హాజరై విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.
- గోల్నాక డివిజన్ గంగానగర్‌లో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద జయంతి వేడుకల కు కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్‌గౌడ్ హాజరై.. వివేకానందుడి విగ్రహానికి పూలమా ల వేసి నివాళులర్పించారు.
- విద్యానగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగా యి. ఈ కార్యక్రమంలో సీతాఫల్మండి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాంచందర్, వివేకానంద కాలేజ్ ప్రిన్సిపాల్ జి.సుకన్య, కల్చరల్ కమిటీ కన్వీనర్ ముక్తావాణి పాల్గొని వివేకానందుడి చిత్ర పటానికి నివాళులర్పించారు.
- శివంరోడ్డులో జరిగిన వివేకానంద జ యంతి వేడుకల్లో ఓయూ ట్రాఫిక్ సీఐ సి.నాగరాజు, ఎస్ఐ దేవదాస్, ఎఎస్ఐ మౌలాలి పాల్గొని వివేకానందుని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- ట్యాంక్‌బండ్‌పై గల స్వామి వివేకానంద విగ్రహానికి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దైవజ్ఞశర్మతో కలిసి తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఎ.ప్రభాకర్, శివరాజ్, సీహెచ్ శ్రీనివాస్, శంకర్, వై. శ్రీనివాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- మాసబ్‌ట్యాంక్‌లోని కళాశాల ఆవరణలో శుక్రవారం స్వామి వివేకానంద చిత్రపటానికి సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జే లక్ష్మణ్‌నాయక్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నవ నీత, ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, 2 ప్రొగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, డాక్టర్ అరవింద్, డాక్టర్ మీనాక్షిలతో కలిసి పూలమా ల వేసి నివాళులర్పించారు.
- ఉస్మానియా దవాఖానలో బీఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానం ద జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవో -1 డాక్టర్ శేషాద్రి, అనష్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండు నాయక్, ఆర్ఎంవోలు పాల్గొన్నారు.
- స్వామి వివేకానంద జయంతి వేడుకలను గోషామహల్ డివిజన్ బీజేపీ అద్యక్షుడు నట రాజ్ నాందారి ఆధ్వర్యంలో గోడేకిఖబర్ తెలుగు తల్లి విగ్రహం వద్ద నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

