అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
మరో రెండు రోజుల పా టు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశా ఖ సూచించిన ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు.
- అత్యవసరమైతే తప్ప ప్రజలకు బయటకు రావద్దు..
- ఫాక్స్‌సాగర్ చెరువు ఆయకట్టు ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వివేకానంద్
కుత్బుల్లాపూర్, జూలై 26 : మరో రెండు రోజుల పా టు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశా ఖ సూచించిన ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు. బుధవారం జీడిమెట్ల, సుభాష్‌నగర్ డివిజన్ల పరిసర ప్రాంతాల్లోని ఫాక్స్‌సాగర్ ఆయకట్టు కింది ప్రాంతాలను ఇరిగేషన్, వాటర్‌వర్క్స్ మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి ఆయన సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా, నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యంత్రాంగం బృందాలుగా ఏర్పడి ప్రజలకు అందుబాటులో ఉండేలా తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని కోరారు.
భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటికే ఫాక్స్‌సాగర్ చెరువు నిండుకుండులా మారుతుందని, దశలవారీగా తూము ద్వారా నీటిని విడుదల చేసేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పైపులైన్రోడ్డులోని హార్టికల్చర్ నర్సరీలో ఉన్నటువంటి కాలువల పూడికతీసి వరదనీరు సాఫీగా పోయేలా చూడాలని, 1500 ఎంఎండీ సామర్థ్యంతో నిర్మిస్తున్న నాలా పనుల ను యుద్ధప్రాతిపాదికన పూర్తి చేయాలని సూచించారు. బీహెచ్ఈఎల్ విస్టాకాలనీలో నిర్మిస్తున్న చైన్ నాలా పనులను త్వరగా పూర్తిచేసి దానిని మెయిన్ నాలాకు అనుసం ధానం చేయాలని, దీని ద్వారా నీరు ఎక్కడ నిలవకుం డా ఆటంకం లేకుండా ఉంటుందన్నారు. స్వేతాఆర్యన్ ఆపార్ట్మెంట్ వద్ద పగిలిపోయిన పైపులైన్‌కు వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు ఎస్ఈ చిన్నారెడ్డి, జీఎం శ్రీధర్‌రెడ్డి, డీజీఎం రాజేశ్, మేనేజర్ రాజు, డీఈఈ భాను, ఏఈ రామారావు, ఏఈ సురేందర్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఫాక్స్‌సాగర్ చెరువును సందర్శించిన డీసీపీ
వరుసగా కురుస్తున్న వర్షాలకు చెరువుల్లో వరద నీరు చేరి నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. జీడిమెట్ల డివిజన్ ఫాక్స్‌సాగర్ చెరువు నిండుతుంది. ప్రధానంగా 33 అడుగుల సామర్థ్యం గల చెరువు ఇప్పటికే వరద నీటితో 29.2 అడుగుల మేర నీటి సామర్థ్యం పెరిగింది. ఈ క్రమంలో చెరువు ఆయకట్టు కింద ఉన్న జనావాసాలకు, ఇతర వాటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతోపాటు ఇతర రక్షణ చర్యలు తీసుకోవడంలో భాగం గా ముందస్తుగా మేడ్చల్ జోన్ డీసీపీ షబరీశ్, అడిషనల్ డీసీపీ ఎండీ ఇక్బాల్సిద్ధిఖుల్, పేట్ బషీరాబాద్ ఏసీపీ రఘునందన్‌రావు, అల్వాల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, పేట్ బషీరాబాద్ సీఐ ప్రశాంత్ పరిశీలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

