e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home హైదరాబాద్‌ షేక్‌పేట్‌లో రేషన్‌ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాగంటి

షేక్‌పేట్‌లో రేషన్‌ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాగంటి

షేక్‌పేట్‌ ఆగస్టు 10 : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ అన్నారు. షేక్‌పేట్‌లో మంజూరు అయిన 312 రేషన్‌ కార్డులను టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ చేపడుతున్న పథకాలతో రాష్ట్రంలో కోట్లాది మంది పేదలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement