ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని మళ్లీ గెలిపిస్తాం
ఎల్బీనగర్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఎల్బీనగర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నాగోలు డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అడాల రమేశ్ అన్నారు.
- ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎస్సీ విభాగం రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం
- త్వరలోనే 59 ఉప కులాలతో దళితుల ఆత్మగౌరవ సభ
ఎల్బీనగర్, సెప్టెంబర్ 24 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఎల్బీనగర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నాగోలు డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అడాల రమేశ్ అన్నారు. ఆదివారం ఎల్బీనగర్లో బీఆర్ఎస్ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లెపాక యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన ఎస్సీ విభాగం ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎస్సీల సమగ్ర అభివృద్ధికి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. దళితబంధు పథకంతో పాటు తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం, భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే అందరికీ తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చేస్తున్న కృషితో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు.
త్వరలోనే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుమతితో ఎల్బీనగర్లోని 59 ఎస్సీ ఉప కులాలతో కలిపి ఓ భారీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తామని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎస్సీ విభాగం సీనియర్ నాయకుడు గంగం శివశంకర్, నాయకులు కొంగర మహేశ్, ఏర్పుల గాలయ్య, బాలాజీ గైక్వాడ్, కృష్ణ, శ్రీధర్, గణపురం కృష్ణ, నవీన్, బాల సుందరం, రెడ్డిమాల కృష్ణ, నర్సింహ, జలందర్, వినోద్, వై. శ్రీరాములు, యాదయ్య, గణేశ్, వినోద్, బి. అనిల్‌కుమార్, శ్రీకాంత్, వెంకటేశ్, నరేశ్, రాజు, బాలరాజు, అనిల్‌కుమార్, నరేశ్, బి. జంగయ్య, మహిళా నేతలు, పదకొండు డివిజన్లకు చెందిన ఎస్సీ విభాగం ముఖ్య నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

