Minister Talasani | వచ్చే నెల 2 నుంచి హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ.. ఆన్లైన్లో లబ్ధిదారుల ఎంపిక: మంత్రి తలసాని
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్‌బెడ్ రూం ఇండ్లు (Double bedroom houses) ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆకాంక్ష అని చెప్పారు.
హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్‌బెడ్ రూం ఇండ్లు (Double bedroom houses) ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆకాంక్ష అని చెప్పారు. వచ్చే నెలలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డబుల్బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తామని తెలిపారు.
మొత్తం 12 వేల మందికి రెండు పడక గదుల ఇండ్ల పట్టాలు అందిస్తామన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్లో మంత్రి మహమూద్ అలీతో కలిసి డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మంత్రి తలసాని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, దళారులను నమ్మొద్దని సూచించారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని చెప్పారు. పేదల సొంతిల్లు కల నెరవేర్చడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సెప్టెంబర్ 2న కుత్బుల్లాపూర్‌లో ఇండ్ల పంపిణీని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఇప్పటికే ప్రకటించారని చెప్పారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే దేశంలోనే మొదటిసారిగా ఆన్లైన్ డ్రా తీస్తున్నామని తెలిపారు. ఎన్ఐసీ రూపొందించిన ర్యాండమ్ సాఫ్ట్వేర్ ద్వారా అర్హులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో మొదటి విడతలో భాగంగా 12 వేల మందికి ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు నామమాత్రపు ఆర్థిక సహాయంతో ఇండ్లను నిర్మించాయని విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో డబుల్ బెడ్రూం ఇండ్లను ఉచితంగా నిర్మించి అందిస్తున్నారని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

