Minister Srinivas Yadav | సీఎం కేసీఆర్ సహకారంతో అభివృది : మంత్రి తలసాని
Minister Srinivas Yadav | తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసునని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గం అమీర్‌పేట డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు.
Minister Srinivas Yadav | తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసునని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గం అమీర్‌పేట డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 75 సంవత్సరాలు పాలించిన పాలకులు ఏనాడూ 24 గంటలు విద్యుత్ ఇవ్వలేదన్నారు. మంచినీటి సమస్యను పట్టించుకోలేదని ఆరోపించారు. ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ.1,00,116 ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ఇంటి పెద్ద కొడుకు మన కేసీఆర్ అని, ప్రతి నెల వృద్ధులకు రూ.2వేల పెన్షన్ ఇస్తున్నాడన్నారు.
ఇల్లు లేని వారికి త్వరలోనే ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద సొంతింటి జాగ ఉంటే ఇల్లుకట్టుకునేందుకు రూ.3లక్షల ఇవ్వనుందన్నారు. ఎన్నికల సమయంలో తాత్కాలిక ఆవేశాలకు లోనై నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామన్నారు. ఇక్కడ గెలిచిన ఎంపీ నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా మిమ్మల్ని కలిశాడా? అని ప్రశ్నించారు. గతంలో నియోజకవర్గ పరిధిలో వంద మందికి దళితబంధు పథకం ఇచ్చామన్నారు. ఈ సారి నియోజకవర్గ పరిధిలో 1,150 మందికి దళితబంధు పథకం అమలు చేయనున్నారన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

