హైదరాబాద్ : ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ – 2022 లో తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారిగా స్ట్రాంగ్ విమెన్‌గా ఎంపికైన మల్లికా రాఘవేందర్ గౌడ్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం సమగ్రమైన ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రాష్ట్రంలో రూపొందిస్తున్నా మన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను, కోచ్ లను ప్రోత్సహిస్తున్నామన్నారు. వచ్చే ఒలింపిక్స్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించేలా రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
పవర్ లిఫ్టింగ్ లో గత 5 సంవత్సరాల నుంచినిలకడగా రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధిస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెస్తున్న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కు చెందినమల్లికా రాఘవేందర్ గౌడ్ ను అభినందించారు. రాష్ట్ర క్రీడా శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నారు.