RTC | ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై పునఃపరిశీలన చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
ఇటీవల ప్రారంభించిన ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ఛార్జీలను పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హైదరాబాద్ : ఇటీవల ప్రారంభించిన ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ఛార్జీలను పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను సమీక్షిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం అమల్లోకి తీసుకొచ్చిన కామన్ పాస్ ధరలు రోజువారీ పాస్‌కు రూ.400 కాగా, ఇందులో మెట్రో వాటా రూ.300, ఆర్టీసీ వాటా రూ.100గా ఉంది. అదేవిధంగా నెలవారీ కామన్ పాస్ ధర రూ.8,500 కాగా, ఇందులో మెట్రో వాటా రూ.7,000, ఆర్టీసీ వాటా రూ.1,500గా నిర్ణయించారు.
అయితే ఈ ఛార్జీలు సామాన్య ప్రజలకు భారంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు ఛార్జీలను పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించి, ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్ ధరలను నిర్ణయించే అంశంపై త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరేలా, వారి అవసరాలకు అనుగుణంగా, సౌకర్యవంతమైన ధరలతో కామన్ పాస్ విధానం అమలయ్యేలా తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

