మరో 9 దవాఖానల్లో టిఫా స్కానింగ్ యంత్రాలు
గ్రేటర్ పరిధిలోని 9 ప్రభుత్వ దవాఖానల్లో టిఫా స్కానింగ్ యంత్రాలను వర్చువల్ పద్ధతిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. దీంతో గ్రేటర్ పరిధిలోని 4 టీచింగ్ హాస్పిటల్స్, 5 వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో కలిపి మొత్తం 12 టీఫా స్కానింగ్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.
- గ్రేటర్లో మొత్తం 12 టిఫా స్కానింగ్ మిషన్లు
- గర్భిణీలకు తప్పనున్న స్కానింగ్ తిప్పలు
సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ)/ శాలిబండ/బన్సీలాల్‌పేట/వనస్థలిపురం/సుల్తాన్‌బజార్/కొండాపూర్/ఘట్కేసర్ : గ్రేటర్ పరిధిలోని 9 ప్రభుత్వ దవాఖానల్లో టిఫా స్కానింగ్ యంత్రాలను వర్చువల్ పద్ధతిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. దీంతో గ్రేటర్ పరిధిలోని 4 టీచింగ్ హాస్పిటల్స్, 5 వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో కలిపి మొత్తం 12 టీఫా స్కానింగ్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. గర్భిణీలకు 5వ నెలలో టీఫా స్కానింగ్ తప్పనిసరి. ఈ పరీక్ష ద్వారా కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదల, పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించే వీలుంటుందని వైద్యులు తెలిపారు. టీచింగ్ హాస్పిటల్స్‌కు సంబంధించి గాంధీలో 2, సుల్తాన్‌బజార్‌లో 2, పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానలో 2, నిలోఫర్ హాస్పిటల్లో 1 చొప్పున 7యంత్రాలు, వీవీపీ పరిధిలోని మలక్‌పేట, నాంపల్లి ఏరియా హాస్పిటల్, కొండాపూర్, వనస్థలిపురం ఏరియా దవాఖానల్లో ఒక్కోటి చొప్పున 5యంత్రాలను ప్రారంభించారు.
- పాతనగరలోని పేట్లబుర్జ్ అధునిక ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో టిఫా స్కాన్ మిషన్‌ను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ ప్రారంభించారు.
- గాంధీ దవాఖానాలో రేడియో డయాగ్నిసిస్ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు టిఫా స్కానింగ్ యంత్రాలను పశు సంవర్థక, మత్స్య, పాడి, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కే.హేమలత, గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, రేడియాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ పి.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
- గర్భిణులకు ఎంతో ముఖ్యమైన టిఫా స్కాన్ సెంటర్‌ను వనస్థలిపురం ఏరియా దవాఖానలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఎన్‌రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, దవాఖాన ఆర్ఎంవో రాజు, రేడియాలజిస్ట్ రాము తదితరులు పాల్గొన్నారు.
- కింగ్‌కోఠి జిల్లా హాస్పిటల్లో టిఫా స్కానింగ్, కలర్ డాప్లర్ యంత్రాలను దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రారంభించారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి దవాఖానలో దవాఖాన సూపరింటెండెంట్ డా.రాజ్యలక్ష్మి హాస్పిటల్ సిబ్బందితో కలిసి టిఫా స్కానింగ్ యంత్రాన్ని ప్రారంభించారు.
- కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో టిఫా స్కాన్ సేవలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సూపరిండెంట్ డాక్టర్ వరదాచారి పాల్గొన్నారు.
- ఘట్కేసర్ ప్రభుత్వ దవఖానలో టిఫా స్కాన్ యంత్రాన్ని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ నారాయణ రావు, మల్కాజిగిరి ఏరియా దవఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్, ఘట్కేసర్ సూపరింటెండెంట్ కోట్యానాయక్, తదితరులు పాల్గొన్నారు.

అన్నీ చక్కగా ఉన్నాయి సార్
గవర్నమెంట్ దవాఖానల అన్ని మంచిగున్నయ్ సార్. నాకు ఇదే ఆసుపత్రిల రెండో కాన్పు. డాక్టర్లు పొద్దున వచ్చినప్పటి నుంచి మంచిగజూస్తరు. పేషంట్లకు ఇచ్చే అన్నం బాగుంది. కూరలు, చారు, పప్పు అన్ని మంచిగున్నాయి. ఇక్కడికొచ్చినంక ఇప్పుడు పైసల్ తగుల్తలేవ్. బయటికి పంపకుండా అన్ని ఇక్కడ్నే చేస్తుండ్రు.
– రాజ్యలక్ష్మి, మహబూబ్‌నగర్
నాకు ఇక్కడ మూడో కాన్పు. డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. మందులు, టెస్టులు అన్ని ఇక్కడే చేయిస్తున్నరు. గతంలో ఏ టెస్టు అయినా బయటకు వెళ్లాల్సి ఉండే . ఇప్పుడు అన్ని ఇక్కడే అందుతున్నాయి. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది.
– జుబేదా బేగం, హైదరాబాద్

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి