Minister Mallareddy | 18న మేడ్చల్‌లో సీఎం కేసీఆర్ సభ
మేడ్చల్‌లో ఈ నెల 18న సీఎం కేసీఆర్ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నియోజకవర్గ స్థాయిలో భారీగా నిర్వహించనున్న బహిరంగ సభకు మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు.
- 18న జరుగబోయే సీఎం కేసీఆర్ సభకు గుండ్లపోచంపల్లి పరిధిలో స్థల పరిశీలన చేస్తున్న మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్, అక్టోబర్ 10 : మేడ్చల్‌లో ఈ నెల 18న సీఎం కేసీఆర్ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నియోజకవర్గ స్థాయిలో భారీగా నిర్వహించనున్న బహిరంగ సభకు మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీఎంఆర్ కళాశాల మైదానం, మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి, హైదరాబాద్-మేడ్చల్ రహదారిలో కొంపల్లి వంతెనకు సమీపంలో కుడివైపున ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు.
ఈ మూడు స్థలాల్లో కొంపల్లి వంతెనకు సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఖరారు చేసినట్టు సమాచారం. 44వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ మైదానం సభకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని నిర్ణయించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు సీఎం కేసీఆర్ సభ కీలకం కావడంతో సభను విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మర్రి నర్సింహా రెడ్డి, శేఖర్ గౌడ్, రామస్వామి, దయానంద్ యాదవ్, రాజమల్లారెడ్డి, భాగ్యారెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

