Minister KTR | దేశంలోనే మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ఇదే.. ట్విట్టర్ ద్వారా పరిచయం చేసిన మంత్రి కేటీఆర్
Minister KTR | దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ హైదరాబాద్‌లో నిర్మితమైంది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు లోపలి వైపు సుమారు 23 కి.మీ దూరంతో ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టింది.
Minister KTR | దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ హైదరాబాద్‌లో నిర్మితమైంది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు లోపలి వైపు సుమారు 23 కి.మీ దూరంతో ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టింది. నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్‌ను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
23 కిలోమీటర్ల పొడవుతో 16 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేసే హెల్త్ వేను పరిచయం చేస్తున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. భారత్‌లోనే ఇది మొట్టమొదటిది అని ఆయన తెలిపారు. దీని తర్వాత రెండో పొడవైన సోలార్ రూఫ్ టాప్ మార్గం దక్షిణ కొరియాలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంత అద్భుతమైన సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణం కోసం కృషి చేసిన హెచ్ఎండీఏ అధికారులను అభినందించారు. దీంతో పాటు సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌కు సంబంధించిన ఒక వీడియోను కేటీఆర్ ట్విట్టర్ ( ఎక్స్) వేదికగా షేర్ చేశారు. కాగా, ఐటీ కారిడార్‌లోని నానక్‌రాంగూడ నుంచి నార్సింగి, మంచిరేవుల మీదుగా తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, నార్సింగి నుంచి కోకాపేట, వట్టినాగులపల్లి మీదుగా కొల్లూరు వరకు మొత్తం 23 కి.మీ దూరం సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్‌ను నిర్మించారు. ఈ సైకిల్ ట్రాక్‌పై సుమారు 16 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో సోలార్ పవర్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా దీన్ని డిజైన్ చేసి ఏర్పాటు చేశారు.
Introducing India’s first and only 23 km long, 3 laned, 16 MW solar power generating Healthway
2nd in world after South Korea (solar roof top covered)
Great job @HMDA_Gov 👍 pic.twitter.com/iXifgip7rS
— KTR (@KTRBRS) October 1, 2023
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

