ఆగస్ట్ 15 లోగా 131 బస్తీ దవాఖానలు సిద్ధం కావాలి.. మంత్రి హరీశ్‌రావు ఆదేశం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు పట్టణ పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రజల సుస్తీని పోగొడుతూ.. అత్యంత ప్రజాదరణ పొందాయన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 259 బస్తీ దవాఖానలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఇదే స్ఫూర్తితో జీహెచ్ఎంసీ సహా ఇతర ప్రాంతాల్లో మరో 131 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని ఆగస్టు 15వ తేదీ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న 12 బస్తీ దవాఖానాలను త్వరగా ప్రారంభించాలని చెప్పారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో బస్తీ దవాఖానలపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు బుధవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. బస్తీ దవాఖానల్లో అందిస్తున్న సేవలను ఆన్లైన్ చేయాలన్నారు. టీ డయాగ్నోస్టిక్ సేవలు వినియోగించుకోవాలని, బస్తీ దవాఖానల్లో టెలీ కన్సల్టేషన్ సేవలు పెంచాలన్నారు. జనాభా సంఖ్యతో పాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. టీ డయాగ్నొస్టిక్ సహకారంతో బస్తీ దవాఖానల్లో ఎక్కడిక్కడే శాంపిల్స్ సేకరణ జరగాలన్నారు. రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాలు త్వరగా ఇవ్వాలని, మరుసటి రోజు వైద్యుడికి రిపోర్టు చూపించి వైద్యం పొందేలా ఉండాలన్నారు. బస్తీ దవాఖానలు, టీ డయాగ్నోస్టిక్ కేంద్రాల వల్ల ఉచిత వైద్యం, రోగ నిర్ధారణ పరీక్షలకు తోడు మందులను ఉచితంగా ఇస్తుండటంతో పేదలకు ఆర్థిక భారం తప్పడమే కాకుండా, ఎంతో ఉపయోగంగా ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్ రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

