MHSRB | అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజినల్ జాబితా విడుదల.. మే 22, 23న సర్టిఫికెట్ వెరిఫికేషన్..!
MHSRB : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది.
MHSRB : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(MHSRB) మంగళవారం విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున (1:3) అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది. హైదరాబాద్ వెంగల్రావు నగర్‌లోన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో ఈ నెల 22, 23 తేదీల్లో వెరిఫికేషన్ జరగనుంది.
ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో పేరున్న వారు విద్యార్హత, కమ్యునిటీ, తదితర అన్ని సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని బోర్డు పేర్కొంది. అనివార్య కారణాల చేత మే 22, 23వ తేదీల్లో వెరిఫికేషన్‌కు హాజరు కాలేని వారు, మే నెల 25వ తేదీన వచ్చి సర్టిఫికెట్లు అందజేయవచ్చునని బోర్డు స్పష్టం చేసింది.
https://drive.google.com/file/d/1tBhMCttt5xOmbvMSgv2bOvrfg8z_wvx7/view?usp=sharing
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 34 డిపార్ట్మెంట్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, అనస్తేషియా డిపార్ట్మెంట్లలోని 174 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది. ఆయా పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇటీవలే నియామక పత్రాలు కూడా అందజేశారు. మిగిలిన 30 డిపార్ట్మెంట్లలోని 433 పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను మంగళవారం విడుదల చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం, ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల జాబితాను విడుదల చేస్తామని బోర్డు తెలిపింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

