Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
Section 22A | రెవెన్యూ, రిజిస్ట్రే షన్ శాఖల మధ్య సమన్వయం లేక పోవ డంతో క్రయ విక్రయాలకు సంబంధించి రిజి స్ట్రేషన్ కార్యాలయాల నుంచి సరైన సమాధా నాలు లభించకపోవడంతో క్రయ విక్రయా లకు దూరంగా ఉంటున్నారు.
Section 22A | మేడ్చల్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): క్రయ విక్రయాలపై ప్రజల్లో 22ఏ నిషేధిత ప్రభావం తొలగడం లేదు. మేడ్చల్-మల్కా జిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన విషయం విధితమే. దీంతో బాధితు లకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పోరాట ఫలి తంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తా మని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ప్రక టించిన నాటి నుంచి ఇప్పటి వరకు జాబితాలో చేర్చిన ప్రైవేట్ ఆస్తుల యజమానులకు తిప్పలు తప్పడం లేదు. కొన్నింటిని తొలగిం చనప్పటికీ పూర్తి స్థాయిలో తొలగింపు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 19 వేల ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం నిషేధిత జాబి తాలో చేర్చినట్లు సర్కారే ప్రకటించింది.
సన్నగిల్లిన నమ్మకం..
జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం కుదరక క్రయ విక్రయాలు ముందుకు సాగడం లేదు. రెవెన్యూ, రిజిస్ట్రే షన్ శాఖల మధ్య సమన్వయం లేక పోవ డంతో క్రయ విక్రయాలకు సంబంధించి రిజి స్ట్రేషన్ కార్యాలయాల నుంచి సరైన సమాధా నాలు లభించకపోవడంతో క్రయ విక్రయా లకు దూరంగా ఉంటున్నారు. డబ్బులు అవసరం ఉన్నవారు నిషేధిత జాబితా నుంచి తొలగించినందున అమ్మకానికి తమ ఆస్తు లను పెడుతున్న కొనుగోలు దారులు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు నేరుగా రిజిస్ట్రే షన్ ప్రధాన కార్యాలయానికి జాబితాను పంపిస్తున్నందున్న ఎన్వోసీలను రెవెన్యూ అధి కారులు ఇవ్వడం లేదు. జాబితా నుంచి తొల గించినట్లు ఎన్వోసీలు ఇస్తే ప్రూఫ్‌గా ఉంటే తప్ప ఆస్తులను కొనుగోలుకు కొనుగోలుదా రులు ముందుకు రావడం లేదని అమ్మకానికి పెట్టిన ప్రైవేట్ ఆస్తుల యజమానులు ఆవేదన చెందుతున్నారు. ఆస్తులను కొనుగోలు చేసేం దుకు రుణాల కోసం బ్యాంకులకు వెళితే రుణాలు ఇచ్చేందుకు కొంత కాలం వేచి ఉండాలి అని బ్యాంకు అధికారులు సూచి స్తున్న క్రమంలో కొనుగోలు దారులు విము ఖత చూయిస్తున్నారు.
నకిలీ యూఎల్ సీలతో ..
జిల్లాలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్లకు చెందిన యూఎల్సీ భూముల్లో ఉన్న ప్లాట్లకు సంబంధించి నకిలీ యూఎల్సీ లేఖలను సృష్టించి రిజిస్ట్రే షన్లు జరిగిన క్రమంలో కొనుగోలు దారులు ఆస్తుల కొనుగోలుకు ముందుకు రాక పోడం కారణంగా కనిపిస్తుంది. జీడిమెట్లలోని సర్వే నంబర్ 192, 193లలో ఉన్న ప్లాట్లకు నకిలీ యూఎల్సీ క్లియరెన్స్ పత్రాలు నకిలీ లేఖలుగా తేల్చి దర్యాప్తు చేసిన పోలీసులు నకిలీ లేఖలను సృష్టించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

