జలమండలి చలివేంద్రాలు కొనసాగించాలి
వర్షాకాలంలో కలుషిత నీరు సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు తగిన మోతాదులో క్లోరిన్ శాతం ఉండేలా చూసుకోవాలని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి సూచించారు. శాంపిల్ కలెక్షన్, పరీక్షల్లోనూ జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు.
- వర్షాకాల ప్రణాళికపై సమీక్షలో జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి
సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ ): వర్షాకాలంలో కలుషిత నీరు సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు తగిన మోతాదులో క్లోరిన్ శాతం ఉండేలా చూసుకోవాలని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి సూచించారు. శాంపిల్ కలెక్షన్, పరీక్షల్లోనూ జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. సోమవారం ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో వర్షాకాల ప్రణాళికపై ఎండీ సుదర్శన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. డివిజన్ల వారీగా వాటర్ లాగింగ్, స్టాగ్నేషన్ పాయింట్లను గుర్తించి నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. రోడ్లపై సీవరేజీ ఓవర్ ఫ్లో కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పని ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు, డీప్ మ్యాన్‌హోళ్లకు గ్రిల్స్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. కలుషిత నీటిపై వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యమిస్తూ మిగిలిన వాటిని కూడా సకాలంలో పరిష్కరించాలని ఎండీ పేర్కొన్నారు. ప్రజావాణి, సోషల్ మీడియాల్లో వచ్చే ఫిర్యాదులపైనా దృష్టి సారించాలని వివరించారు. ఈఆర్టీ టీమ్స్ బృందాలపై ఆరా తీశారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి జలమండలి ఏర్పాటు చేసిన చలి వేంద్రాలను కొనసాగించాలని ఎండీ సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు.
జన సంచారం ఎక్కువగా ఉండే వైద్యశాలలు, బస్టాండ్లు వంటి ప్రాంతాల్లో చలివేంద్రాల కొనసాగింపునకు నిర్ణయం తీసుకున్నారు. నిత్యం జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో తాగునీరు అందించాలని ఎండీ తెలిపారు. డివిజన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు పరిశీలించారు. ఎప్పటికప్పుడు బిల్లులు వసూలు చేయాలన్నారు. గృహ వినియోగదారులతో పాటు వాణిజ్య కనెక్షన్లపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా మొండి బకాయిదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎండీ చెప్పారు. ఎంతో కాలంగా బిల్లులు చెల్లించని వినియోగదారులతో ఫోన్ చేసి మాట్లాడాలని సూచించారు. ఈ సమీక్షలో డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

