7 పంపులు.. 168 ఎంజీడీలు
ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముర్మూర్ వద్ద ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ పంపింగ్ పనులను ఎండీ సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. గురువారం జలమండలి అధికారులతో కలిసి ప్రాజెక్టుకు వెళ్లి పంపింగ్ పనులు పరిశీలించారు.
- ఎల్లంపల్లిలో ఎమర్జెన్సీ పంపింగ్ పనులు షురూ
- పరిశీలించిన జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి
సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముర్మూర్ వద్ద ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ పంపింగ్ పనులను ఎండీ సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. గురువారం జలమండలి అధికారులతో కలిసి ప్రాజెక్టుకు వెళ్లి పంపింగ్ పనులు పరిశీలించారు. హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలుగా పంపింగ్ ప్రారంభించామని ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. 20 పంపులు ఏర్పాటు చేశామని , ప్రస్తుతం 7 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నట్లు వెల్లడించారు. అవసరాన్ని నీటి లభ్యతను బట్టి మిగిలిన పంపులను కూడా దశల వారీగా ప్రారంభిస్తామన్నారు. గోదావరి పథకం ద్వారా నగరానికి 168 ఎంజీడీల నీరు తరలించనున్నట్లు వివరించారు.
నీటి కొరత రాకుండా..
వర్షపాతం తక్కువ నమోదు కావడంతో ఎగువ ఉన్న కడెం ప్రాజెక్టు నుంచి ఎలాంటి వరద లేదు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. ఇలాగే కొనసాగితే హైదరాబాద్ నగరానికి గోదావరి డ్రికింగ్ వాటర్ సఫ్లయి పథకం ద్వారా అందించే నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడతాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు.
కీలక ప్రాంతాలకు నీటి సరఫరా
ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో ఎక్కువ నీరు ఉంటే గ్రావిటీ ద్వారా ముర్మూర్లోని పంప్‌హౌజ్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి పంపింగ్ ద్వారా సిద్దిపేట్ దగ్గరలోని మల్లారం పంప్‌హౌజ్‌కు తరలిస్తారు. తర్వాత అక్కడి నుంచి నగరానికి సరఫరా చేస్తున్నారు. కానీ ఇప్పుడు నీటి మట్టం తగ్గిపోవడంతో ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నీటి తరలింపునకు ఏర్పాట్లు చేశారు. ఐటీ కారిడార్ పరిధిలోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, లింగంపల్లి, మియాపూర్, చందానగర్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజిగిరి తదితర ప్రాంతాలకు గోదావరి జలాల ద్వారానే నీరు అందిస్తున్నారు.
ఎనిమిదేండ్ల విరామం తర్వాత
దాదాపు ఎనిమిదేండ్ల తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నీటి సరఫరా జరుగుతున్నది. 2016లో ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసి హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్ ఏర్పాటు చేసి నీటిని తరలిస్తున్నారు. ఎమర్జెన్సీ పంపింగ్ పనులు పరిశీలించిన తర్వాత ఈ పర్యటనలో ఎండీ సుదర్శన్‌రెడ్డి ముర్మూర్లోని గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పంప్‌హౌజ్‌ను సందర్శించి స్కాడా రూం రికార్డులను పరిశీలించారు. తర్వాత మల్లారంలోని నీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ నీటి శుద్ధి జరిగే ప్రక్రియ, నీటి పరీక్షల వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో కొత్త నీరు చేరే అవకాశం ఉన్నందున ఆ సమయంలో గంటకు ఒకసారి శాంపిల్ తీసి టెస్ట్ చేయాలని ఎండీ సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

