కేసీఆర్ పాలనకు కేంద్రం కితాబు
పదేళ్ల కేసీఆర్ పాలనలో తల్లీబిడ్డల ఆరోగ్యం సంరక్షణ కోసం చేపట్టిన కృషికి కేంద్రం కితాబిచ్చింది. మాతా శిశు సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం అధిక ప్రగతిని సాధించిందని తాజా నివేదికల్లో స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఆరోగ్య కార్యక్రమాలకు గౌరవ సూచకంగా, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన శిశు మరణాల రేటు, తల్లి మరణాల రేటు తగ్గించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానాల్లో ఉంది.
- బీఆర్ఎస్ హయాంలో తగ్గిన మాతా శిశు మరణాలు
- దక్షిణాది రాషా్ర్టల్లో మొదటి స్థానంలో కేరళ, రెండో స్థానంలో తెలంగాణ
- 2019-2021 ఎస్ఆర్ఎస్ గణాంక నివేదిక విడుదల
సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): పదేళ్ల కేసీఆర్ పాలనలో తల్లీబిడ్డల ఆరోగ్యం సంరక్షణ కోసం చేపట్టిన కృషికి కేంద్రం కితాబిచ్చింది. మాతా శిశు సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం అధిక ప్రగతిని సాధించిందని తాజా నివేదికల్లో స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఆరోగ్య కార్యక్రమాలకు గౌరవ సూచకంగా, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన శిశు మరణాల రేటు, తల్లి మరణాల రేటు తగ్గించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానాల్లో ఉంది. గురువారం ఢిల్లీలోని జనగణన ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయం 2019-21 నమూనా నమోదు వ్యవస్థ (ఎస్ఆర్ఎస్) గణాంక నివేదిక విడుదల చేసింది.ఆ నివేదిక ప్రకారం దక్షిణ భారతదేశంలో కేరళ తరువాత తల్లి మరణాల రేటు తగ్గింపులో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
మెరుగైన స్థితిలో ఉన్నాం..
శిశు మరణాల రేటు గ్రామీణం, పట్టణ ప్రాంతాల్లో కాస్త వ్యత్యాసంగా ఉంది. నగరాల్లో 16, గ్రామీణంలో 23గా నమోదైంది. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటులో 2014-15లో 41గా ఉండగా, 2021 నాటికి 22కి తగ్గింది. దేశ సగటు 31 కాగా, తెలంగాణ మెరుగైన స్థితిలో ఉంది.
ఇదీ పరిస్థితి…
తల్లి మరణాల రేటులో దేశ సగటు 93ఉండగా, దక్షిణ భారత సగటు రేటు 47గా నమోదైంది. తెలంగాణ (45), ఆంధ్రప్రదేశ్ (46), కర్ణాటక (63),తమిళనాడు(49), కేరళ (20), బీహార్ (100), ఉత్తరప్రదేశ్(151), గుజరాత్(53), మధ్యప్రదేశ్(175), ఛత్తీస్గఢ్ (132) ఉండటం గమనార్హం. శిశు మరణాల రేటులో దేశ సగటు 27 నమోదు కాగా.. తెలంగాణ (20), ఆంధ్రప్రదేశ్ (22), కర్ణాటక (17), తమిళనాడు(12), కేరళ(6) ఉండటం విశేషం. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటులో దేశ సగటు ( 31) ఉండగా, తెలంగాణ (22), తమిళనాడు(14), కేరళ (8)రాషా్ర్టలు ఉన్నాయి.
శిశు మరణాల రేటు తగ్గింది..
తల్లి మరణాల రేటులో దేశ సగటు 93గా ఉండగా, తెలంగాణలో 45గా నమోదైంది. కేరళ (20), తమిళనాడు (49), ఆంధ్రప్రదేశ్ (46), కర్ణాటక (63)గా నమోదయ్యాయి. 2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలో శిశుమరణాల రేటు 39గా ఉండగా, ఇప్పుడు అది 20కి తగ్గింది. దేశ సగటు 27గా ఉండగా, తెలంగాణ ఇందులో మెరుగ్గా నిలిచింది. తమిళనాడు (12), కర్ణాటక (17), ఆంధ్రప్రదేశ్ (22), కేరళ (6) రాష్ర్టాలు నిలిచాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

