Peerzadiguda | పీర్జాదిగూడ: పీర్జాదిగూడ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నట్లు చర్చ కొనసాగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఏదో విధంగా ప్రలోభపెట్టి మేయర్‌ను గద్దె దించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో జక్క వెంకట్‌రెడ్డిని గద్దె దించేందుకు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. అయితే మెజార్టీ కార్పొరేటర్లు మాత్రం మేయర్ జక్క వెంకట్‌రెడ్డి వెంటే ఉండటం విశేషం.