Hyderabad | గచ్చిబౌలిలో ప్రేమోన్మాది వీరంగం.. యువతి మృతి, ముగ్గురికి గాయాలు
హైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలిలో ప్రేమోన్మాది వీరంగం సృష్టించాడు. పెండ్లికి నిరాకరించిందని యువతిని దారుణంగా హత్యచేశాడు. అడ్డుకోబోయిన ముగ్గురు యువతులను గాయపరిచాడు. అనంతరం అతడూ ఆత్మహత్నం చేశాడు. బెంగాల్‌కు చెందిన గ్రీష్మ అనే యువతి గచ్చిబౌలిలోని గోపన్‌పల్లి తండాలో ఉంటూ నల్లగండ్లలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నది.
హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలిలో ప్రేమోన్మాది వీరంగం సృష్టించాడు. పెండ్లికి నిరాకరించిందని యువతిని దారుణంగా హత్యచేశాడు. అడ్డుకోబోయిన ముగ్గురు యువతులను గాయపరిచాడు. అనంతరం అతడూ ఆత్మహత్నం చేశాడు. బెంగాల్‌కు చెందిన గ్రీష్మ అనే యువతి గచ్చిబౌలిలోని గోపన్‌పల్లి తండాలో ఉంటూ నల్లగండ్లలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నది. ఆమె గతంలో పనిచేసిన చోట కర్ణాటకలోని బీదర్‌కు చెందిన రాకేశ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరు దగ్గరయ్యారు. అయితే కొన్నిరోజులుగా అతడిని గ్రీష్మ దూరం పెడుతూ వస్తున్నది.
ఈ క్రమంలో బుధవారం రాత్రి గోపన్‌పల్లిలోని గ్రీష్మ ఇంటికి వెళ్లిన రాకేశ్.. తనను పెండ్లి చేసుకోవాలని పట్టుబడ్డాడు. దీనికి ఆమె తిరస్కరించడంతో కూరగాయలు కోసే కత్తిలో ఆమెను పొడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె మృతిచెందింది. అడ్డుకోబోయిన ఆమె స్నేహితురాళ్లను కూడా పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
కాగా, కనకమామిడి వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి రాకేశ్ ఆత్మహత్యా యత్నం చేశాడు. విద్యుదాఘాతంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని దవాఖానకు తరలించారు. అయితే ప్రస్తుతం రాకేశ్ పరిస్థితి విషమంగా ఉనన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

