కూరలో బల్లి.. జేఎన్టీయూలో కలకలం
జేఎన్టీయూలోని హాస్టల్లో భోజనాలు చేస్తుండగా.. కూర గిన్నెలో బల్లి కనిపించడం కలకలం రేపింది. గురువారం రాత్రి మంజీరా హాస్టల్లో విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారు.
కేపీహెచ్‌బీకాలనీ : జేఎన్టీయూలోని హాస్టల్లో భోజనాలు చేస్తుండగా.. కూర గిన్నెలో బల్లి కనిపించడం కలకలం రేపింది. గురువారం రాత్రి మంజీరా హాస్టల్లో విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారు. కొందరు భోజనం చేస్తుండగా.. కూర గిన్నెలో బల్లి సజీవంగా కనిపించింది. దీంతో విద్యార్థులు కలవరపాటుకు గురయ్యారు.
వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాసిరకంగా భోజనం చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనంలో పురుగులు రావడం వంటి ఘటనలు పునరావృతమవుతున్నా.. సరైన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. కాగా, విద్యార్థులు భోజనం చేసిన తర్వాత కూర గిన్నెలో బల్లి కనిపించిందని,ఆ కూరను వడ్డించలేదని, అందువల్ల్లే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని వర్సిటీ అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

